సైలెంట్‌గా ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన స్టార్ హీరో
భజరంగి భాయిజాన్, టైగర్ ఫ్రాంఛైజీలో తొలి రెండు సినిమాలు సల్మాన్ ఖాన్ కెరీర్ కి గొప్ప విజయాలుగా నిలిచాయి.
By: Sivaji Kontham | 15 Aug 2025 4:00 AM ISTభజరంగి భాయిజాన్, టైగర్ ఫ్రాంఛైజీలో తొలి రెండు సినిమాలు సల్మాన్ ఖాన్ కెరీర్ కి గొప్ప విజయాలుగా నిలిచాయి. టైగర్ 3 ఆశించినంత విజయం సాధించలేదు. భారీ సినిమాలు ఫ్లాపులవ్వడంతో సల్మాన్ ఖాన్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఇప్పుడు కంబ్యాక్ కోసం అతడు ఒక దేశభక్తి సినిమాని ప్లాన్ చేసాడు. ఇది ఇండియా-చైనా బార్డర్ నేపథ్యంలోని సినిమా. గల్వాన్ లోయలో భారత సైనికులు, చైనా సైనికుల మధ్య సాగిన భయానకమైన బాహాబాహీ ముష్ఠి యుద్ధం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే స్క్రిప్టును సిద్ధం చేసారు.
అయితే ఈ సినిమా చిత్రీకరణ రకరకాల కారణాలతో ఆలస్యమవుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రముఖ విమర్శకుడు కేఆర్కే తాజా కథనంలో ఊహించని కొన్ని కారణాలను చెప్పుకొచ్చాడు. ఈ సినిమా బడ్జెట్ల కారణంగా లేదా నటీనటుల సమస్యతో ఆగిపోలేదని, ఈ కథ భారత రక్షణ శాఖ ఆమోదం పొందాల్సి ఉండగా, అది లభించలేదని కేఆర్కే చెప్పారు. మొదట ఈ సినిమా తీయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారతదేశం ఇప్పుడు పొరుగు దేశమైన చైనాతో దౌత్య పరమైన సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటోంది. వ్యాపార వాణిజ్యాల పరంగా ఇప్పుడు ఇరు దేశాలు స్నేహ సంబంధాలను పెంచుకోవాలనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో గల్వాన్ లోయ వివాదంపై సినిమా తీస్తే అది సంబంధాలను దెబ్బ తీస్తుంది. అందువల్ల రక్షణ శాఖ దీనికి అనుమతులు ఇవ్వలేదని కేఆర్కే తన కథనంలో పేర్కొన్నారు.
సల్మాన్ ఖాన్‌కి ఇది మంచి దేశభక్తి సినిమా అవుతుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ సమయంలో ఇలాంటి సినిమాని తెరకెక్కించినా కానీ రిలీజ్ కి ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే సల్మాన్ సైలెంట్ గా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టడం మంచి నిర్ణయం అవుతుందని కేఆర్కే విశ్లేషించాడు.
