షాకింగ్: సూపర్‌స్టార్‌పై ముప్పేట దాడి
ఇండస్ట్రీని ఏల్తున్న స్టార్ హీరోని కొందరు ప్రముఖులు అదే పనిగా టార్గెట్ చేసారు. అందులో ఒకరు అసలు అతడికి నటనే రాదని తీవ్రంగా విమర్శించగా, మరొకరు షూటింగులకు ఎప్పుడూ టైమ్ కి రాడని విమర్శించారు.
By: Sivaji Kontham | 30 Oct 2025 8:00 PM ISTఇండస్ట్రీని ఏల్తున్న స్టార్ హీరోని కొందరు ప్రముఖులు అదే పనిగా టార్గెట్ చేసారు. అందులో ఒకరు అసలు అతడికి నటనే రాదని తీవ్రంగా విమర్శించగా, మరొకరు షూటింగులకు ఎప్పుడూ టైమ్ కి రాడని విమర్శించారు. అతడు ఆలస్యంగా వస్తాడు గనుక, పగలు తెరకెక్కించాల్సిన సీన్లను రాత్రి పూట తెరకెక్కించానని అసలు ఎమోషన్స్ కూడా సరిపోలేదని ఒక ప్రముఖ దర్శకుడు సదరు హీరోని విమర్శించారు. ఇక ఈ స్టార్ హీరోకి స్నేహితుడు కూడా తన వర్కింట్ స్టైల్ గురించి విమర్శిస్తూ, అసలు టైముకు వచ్చేది లేదు! అని సైలెంట్ గా చురకలు వేసాడు. ఆ ముగ్గురితో పాటు ఇంకా పలువురు బాధితులు స్టార్ హీరోతో ఇబ్బందులేమిటో ఘాటుగానే విమర్శించారు. అతడు దర్శకులను, క్రియేటర్లను నియంత్రిస్తాడని కూడా విమర్శించాడు ప్రముఖ దర్శకుడు.
ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో మరెవరో కాదు.. ది గ్రేట్ సల్మాన్ ఖాన్. అతడిపై కొద్ది రోజులుగా దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నాడు. అసలు సల్మాన్ కి నటనే రాదని, దర్శకులను నియంత్రిస్తాడని, కెరీర్ ని నాశనం చేస్తాడని తీవ్రంగా ఆరోపించాడు.
అభినవ్ కంటే ముందు సికందర్ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ సైతం సల్మాన్ ఖాన్ క్రమశిక్షణా రాహిత్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసాడు. సికందర్ ఫ్లాపవ్వడానికి సల్మాన్ ప్రవర్తన ఒక కారణమని అన్నాడు. తాను తీయాలనుకున్న సన్నివేశాన్ని సరిగా తీయలేకపోవడానికి అతడు ఆలస్యంగా సెట్స్ కి రావడం కూడా ఒక కారణమని విమర్శించాడు. సల్మాన్ షూటింగుకి ఆలస్యంగా రావడం వల్ల పగలు తీయాల్సిన సీన్ రాత్రి పూట షూట్ చేయాల్సి వచ్చేదని కూడా ఆవేదన చెందాడు. అయితే మురుగదాస్ పైనా, అభినవ్ పైనా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వేదికపై సెటైర్లు వేసాడు. తన అనుకున్నవాళ్లే తనపై విమర్శల దాడి చేస్తున్నారని అన్నారు.
ఇప్పుడు క్యూలో ఇమ్రాన్ హష్మి కూడా చేరాడు. కొందరు సెట్స్ కి సరైన సమయానికి రాలేరని ఇమ్రాన్ విమర్శించాడు. తనలాగా నటి యామి గౌతమ్ మాత్రమే సమయపాలనను అనుసరిస్తోందని కితాబిచ్చాడు. ఇమ్రాన్- యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన హక్ ప్రమోషన్స లో అతడు ఈ కామెంట్ చేసాడు. అయితే ఇమ్రాన్ కామెంట్ చేసింది ఎవరినుద్ధేశించి? అనేది విశ్లేషిస్తే, అది కచ్ఛితంగా సల్మాన్ క్రమశిక్షణా రాహిత్యం గురించే ఇలా కామెంట్ చేసాడని అర్థం చేసుకోవచ్చు. అతడు `టైగర్- 3` షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ క్రమశిక్షణ ఎలా ఉంటుందో నేరుగా చూసాడు గనుక ఈ కామెంట్ అతడిపైనే! అని నెటిజనులు గెస్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ లేజీ షెడ్యూల్ గురించి పలువురు పలు సందర్భాల్లో తీవ్రంగానే విమర్శించారు. అయితే కొన్నేళ్ల క్రితం తాను ఒకే రోజు మూడు నాలుగు షూటింగులు చేసేవాడినని, దాని కారణంగా ఇతరులు వేచి చూడాల్సి వచ్చేదని ఇటీవల అమీర్ ఖాన్ తో చాటింగ్ సమయంలో సల్మాన్ వెల్లడించాడు. సల్మాన్ తో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఎప్పుడూ సెట్స్ కి ఆలస్యంగా వచ్చేవాడని అమీర్ ఖాన్ పంచ్ వేయగా దానికి సల్మాన్ ధీటుగా స్పందిస్తూ, అమీర్ ఖాన్ సమయానికి వచ్చేవాడని, తాను మాత్రం వేరే షూటింగుల నుంచి అతడి సెట్స్ కి రావాల్సి వచ్చేదని కూడా సల్మాన్ చెప్పాడు. ఇక సల్మాన్ ఖాన్ లేట్ నైట్ పార్టీల గురించి చాలా మంది స్టార్లు వేదికలపైనే సెటైర్లు వేస్తారు. అతడు స్నేహితులకు పార్టీలు చేసి మిడ్ నైట్ దాటాక నిదురిస్తాడు. అందుకే లేటుగా సెట్స్ కి వస్తాడని కూడా పలువురు గతంలో విమర్శించారు.
