Begin typing your search above and press return to search.

దర్శకుల ఆరోపణలపై సూపర్‌ స్టార్‌ రియాక్షన్‌

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ పై ఇద్దరు దర్శకులు తక్కువ వ్యవధిలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   14 Oct 2025 7:00 PM IST
దర్శకుల ఆరోపణలపై సూపర్‌ స్టార్‌ రియాక్షన్‌
X

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ పై ఇద్దరు దర్శకులు తక్కువ వ్యవధిలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా సౌత్‌ దర్శకుడు మురుగదాస్ సికిందర్ అనుభవాలను షేర్ చేసుకుంటూ సల్మాన్‌ ఖాన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. సమయ పాలన విషయంలో సల్మాన్‌ ఖాన్‌పై పెద్ద ఆరోపణలు చేయడం జరిగింది. సల్మాన్‌ ఖాన్‌ షూటింగ్‌కు రాత్రి 8 గంటల సమయంలో వచ్చేవాడని, ఆయన వచ్చిన కొన్ని గంటల తర్వాత షూటింగ్‌ ప్రారంభించాల్సి వచ్చేది. షూటింగ్‌ను ఎక్కువగా రాత్రి 11 గంటలకు ప్రారంభించి 2 నుంచి 3 గంటల సమయంలో ముగించేయాల్సి వచ్చేదని మురుగదాస్‌ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో మాత్రమే సల్మాన్‌ ఖాన్‌కు వీలు ఉండేదని, అందుకే షూటింగ్‌ను అర్థ రాత్రి సమయంలో మాత్రమే చేయాల్సి వచ్చిందని మురుగదాస్‌ ఆరోపించిన విషయం తెల్సిందే.

సల్మాన్‌ ఖాన్‌ పై తీవ్ర విమర్శలు

సల్మాన్‌ ఖాన్‌ వచ్చిన సమయం వల్ల చాలా సన్నివేశాలు పేలవంగా వచ్చాయని మురుగదాస్‌ అన్నాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్‌ సీన్స్ ఆ సమయంలో తీయడం సాధ్యం కాలేదని, దాంతో చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని మురుగదాస్‌ అన్నాడు. ఎన్నో సన్నివేశాల యొక్క నాణ్యత దెబ్బ తినడానికి కారణం కేవలం సల్మాన్‌ ఖాన్‌ సమయ పాలన సరిగ్గా లేక పోవడం అని మురుగదాస్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. సల్మాన్‌ ఖాన్‌ గత చిత్రాల షూటింగ్స్ సైతం అలాగే జరిగేవి అని, ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్‌ అలాగే జరుగుతూ ఉండవచ్చు అనే చర్చ తారా స్థాయిలో జరిగింది. దాంతో సల్మాన్‌ ఖాన్‌ ను చాలా మంది ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సల్మాన్‌ ఖాన్‌ ఏం చేస్తాడో అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు.

సికిందర్‌ సినిమా ఫ్లాప్‌కి కారణం ఇదే..

మురుగదాస్‌ మాత్రమే కాకుండా సల్మాన్‌ ఖాన్‌తో దబాంగ్‌ సినిమాను అభినవ్ కశ్యప్ సైతం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. సల్మాన్‌ ఖాన్‌ ను అభినవ్‌ కశ్యప్‌ ఏకంగా గూండా అంటూ సంభోధించాడు. ఆయనకు సినిమా ఎలా వచ్చిన పర్వాలేదు, కానీ తన స్టార్‌డం మాత్రం కాపాడబడాలి. ఆయన తన సెలబ్రిటీ హోదాను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తాడు. ఆ సెలబ్రిటీ హోదా కోసం సల్మాన్‌ ఖాన్‌ ఏమైనా చేస్తాడని అన్నాడు. అందుకే దబాంగ్‌ సినిమా యొక్క సీక్వెల్‌కు తనను సంప్రదించిన సమయంలో తిరష్కరించినట్లుగా అభినవ్‌ పేర్కొన్నాడు. ఈ ఇద్దరు దర్శకులు చేసిన ఆరోపణలపై సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేయడం జరిగింది. ఇప్పటికే అభిమానులు చేస్తున్న విమర్శలకు తోడు స్వయంగా సల్మాన్‌ ఖాన్‌ సైతం స్పందించడంతో మరింతగా ఈ విషయం చర్చనీయాంశం అయింది.

మురుగదాస్ వ్యాఖ్యలకు సల్మాన్‌ సమాధానం

సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల ఆ ఇద్దరు దర్శకులు వ్యాఖ్యల గురించి తనదైన శైలిలో స్పందించాడు. అయితే సీరియస్‌గా కాకుండా కాస్త వ్యంగంగా సల్లూ భాయ్‌ స్పందించడం కూడా చర్చనీయాంశం అయింది. సల్మాన్‌ మాట్లాడుతూ.. సికిందర్‌ సమయంలో తాను షూటింగ్‌కు వెళ్లడం నిజమే, అయితే తాను కేవలం గాయాల కారణంగా, ఆ గాయల నొప్పుల కారణంగానే సెట్స్‌కి ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చిందని అన్నాడు. తాను గతంలోనూ మరుగదాస్‌తో చేసిన కొందరు లీడ్‌ యాక్టర్స్‌ ఆలస్యంగా వచ్చిన దాఖలాలు ఉన్నాయని సల్మాన్‌ అన్నాడు. కేవలం తన సమయ పాలన సరిగ్గా లేక పోవడం వల్లే సికిందర్‌ సినిమా ఫ్లాప్‌ అయిందంటే మాత్రం ఒప్పుకోను అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇది ఇతరులను బ్లేమ్‌ చేసే గేమ్‌లో ప్రధానమైనది అన్నట్లుగా సల్మాన్‌ ఖాన్‌ ఎద్దేవ చేశాడు, దర్శకుడు పని పట్ల, ఆయన కుటుంబం పట్ల దృష్టి పెడితే బాగుంటుందని సున్నితంగా విమర్శించాడు. ఈ సమాధానంకు మురుగదాస్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.