Begin typing your search above and press return to search.

అంత పెద్ద స్టార్ ఇదేమి పీఆర్ స్టంట్?

మరోవైపు ఈ పోస్ట్ కింద నెటిజన్లు సల్మాన్ ఖాన్ పాత వివాదాలను గుర్తుచేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   28 Jun 2026 3:00 PM IST
అంత పెద్ద స్టార్ ఇదేమి పీఆర్ స్టంట్?
X

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబై వీధుల్లో సైకిల్ తొక్కుతూ తన త‌దుప‌రి చిత్రం SVC63 సెట్స్‌కు వెళ్లారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన ఇలా సాధారణ లుక్‌లో, నిక్క‌రు వేసుకుని ట్రాఫిక్ లో ఆగి ఆగి వెళ్లారనేది ఆ పోస్ట్ సారాంశం. అయితే ఈ వార్త బయటకు రాగానే నెటిజన్లు అలర్ట్ అయిపోయి, దీని వెనకున్న అసలు నిజాలను వెలికితీసే పనిలో పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్ట్‌పై వచ్చిన కామెంట్లు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి.

ఈ ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో చాలామంది ఈ ఫోటోలు నిజ‌మైన‌వి కాద‌ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. సల్మాన్ ఖాన్ జుట్టు (హెయిర్ స్టైల్) ఆధారంగా ఇది ముమ్మాటికీ పాత ఫోటోనే అని నెటిజన్లు కనిపెట్టేశారు. కేవలం వారం రోజుల క్రితం ఒక బహిరంగ కార్యక్రమానికి గుండుతో వచ్చిన సల్మాన్‌కు.., నాలుగు రోజుల్లోనే ఇంత పెద్ద జుట్టు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇవి 2019 లేదా 2020 నాటి పాత ఫోటోలు.. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసమే వీటిని ఇప్పుడు కొత్త ఫోటోలు అంటూ భ్ర‌మింప‌జేస్తున్నారని నెటిజన్లు తేల్చిచెప్పారు.

మరోవైపు ఈ పోస్ట్ కింద నెటిజన్లు సల్మాన్ ఖాన్ పాత వివాదాలను గుర్తుచేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన గతంలో ఎదుర్కొన్న హిట్ అండ్ రన్ కేసు, కృష్ణజింకల వేట కేసులను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కార్ కాకుండా సైకిల్ కాబట్టి రోడ్డు పక్కన ఉన్నవారికి ప్రమాదం లేదు! అని ఒకరు, ఈసారి బ్లాక్ బగ్ (కృష్ణజింక) బతికిపోయింది! అని మరొకరు డార్క్ హ్యూమర్‌తో కామెంట్లు పెడుతున్నారు. సల్మాన్ ఖాన్ చుట్టూ ఉండే వివాదాలు ఆయనను ఇలాంటి సమయాల్లో ఎలా వెంటాడుతాయో ఈ కామెంట్లు నిరూపిస్తున్నాయి.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌కు ఉన్న భద్రతా ముప్పును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే అస‌లు స‌ల్మాన్ ఇంటి నుంచి బ‌య‌ట అడుగుపెట్ట‌గ‌ల‌డా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు కూడా ఈ కామెంట్లలో ప్రముఖంగా వినిపిస్తోంది. ముంబైలో అత‌డికి కల్పించిన భారీ సెక్యూరిటీని గుర్తు చేస్తూ..ఈ ఫోటో ఫ్రేమ్ అవతల కనీసం 500 మంది పోలీసులు రక్షణగా ఉంటారు.. ఇదంతా కేవలం పీఆర్ స్టంట్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అలాగే బిష్ణోయ్ గ్యాంగ్ ఈ కదలికలను గమనిస్తూనే ఉంటుందనే అర్థంలో కొందరు నెగెటివ్ కామెంట్లు, మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఈ విమర్శలు, ట్రోల్స్ ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ కరడుగట్టిన అభిమానులు (డై-హార్డ్ ఫ్యాన్స్) మాత్రం తమ భాయ్‌జాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కామెంట్ సెక్షన్‌ను హార్ట్, ఫైర్ ఎమోజీలతో ముంచెత్తుతూ అత‌డిపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ సైకిల్ రైడింగ్ వార్త కేవలం ఒక పాత జ్ఞాపకమే తప్ప...లైవ్ ఫోటో కాదనేది కామెంట్ సెక్షన్‌ను బట్టి స్పష్టమవుతోంది. స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ల‌వ్ అండ్ వార్ డ్రామా మాతృభూమి విడుద‌ల కావాల్సి ఉంది. త‌దుప‌రి వంశీ పైడిప‌ల్లితో భారీ క‌మ‌ర్ష‌య‌ల్ యాక్ష‌న్ సినిమా ఎలా ఉండ‌బోతోందోన‌నే ఉత్కంఠ అంద‌రిలోను నెల‌కొంది.