Begin typing your search above and press return to search.

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

‘రామాయణం’ సినిమా గురించి చర్చ బడ్జెట్, వీఎఫ్ఎక్స్ చుట్టూ కాకుండా మూలకథ, పాత్రల చుట్టూ జరగాలని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. రాముడు, సీత, రావణుడి పాత్రలు, వాటిలోని భావోద్వేగాలకే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారీ బడ్జెట్ కంటే బలమైన కథ, ఎమోషన్‌నే సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయని ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

By:  Srikanth Kontham   |   7 Nov 2026 2:53 PM IST
రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!
X

`మాతృభూమి` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పౌరాణిక చిత్రం `రామాయణం` గురించి ఈ వేదికపై స‌ల్మాన్ స్పందించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన‌ ఆర్థిక విషయాలకంటే దాని మూల కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని స‌ల్మాన్ సూచించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో4000 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌పై అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ ట్రెండ్‌పై సల్మాన్ ఖాన్ స్పందించారు. `రామాయణ సినిమా గురించిన చర్చ కేవలం రామాయణ గ్రంథం, అందులోని పాత్రల పైనే జరగాలి . కానీ వీఎఫ్ఎక్స్ .. ప్రొడక్షన్ కాస్ట్ పై కాదు` అని హితవు పలికారు. సినిమా బడ్జెట్ .. గ్రాఫిక్స్ చుట్టూ మాత్రమే చర్చ నడవడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమాలోని టెక్నికల్ అంశాల కంటే పాత్రల భావోద్వేగాలకే ప్రాముఖ్యత ఇవ్వాలని సల్మాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రామ, రావణ, సీత వంటి ప్రధాన పాత్రల చుట్టూనే ప్రేక్షకుడి దృష్టి ఉండాలని నొక్కి చెప్పారు.

శ్రీరామచంద్రుడు ఆదర్శవంతమైన కుమారుడిగా, భర్తగా, తండ్రిగా , గొప్ప యోధుడిగా ఎలా నిలిచారనే విషయాలను ప్రేక్షకులు గమనించాలన్నారు. ఇప్ప‌టికే రామ‌య‌ణం మొద‌టి భాగం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు మంచి రివ్యూలు..పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా బ‌డ్జెట్ ఎంత అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ స‌రైన క్లారిటీ లేదు. 4000 కోట్ల బ‌డ్జెట్ అని..అందులో మొద‌టి భాగానికి 1000 కోట్ల‌కు పైగా వెచ్చించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అలాగే రామాయ‌ణం రెండ‌వ భాగం వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇంకా రామాయ‌ణం 3 కూడా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ సినిమాకి ఎన్ని కోట్లు పెట్టినా? అంతిమంగా ఆ సినిమాను న‌డిపించేది బ‌ల‌మైన క‌థ‌...ఎమోష‌న్. మొద‌టి భాగంలో విజువ‌ల్ గా హైలైట్ అయినా? ఎమోష‌న్ ప‌రంగా వీక్ గా ఉంద‌నే విమ‌ర్శ వ్య‌క‌మ‌వుతుంది. పైగా రామాయ‌ణం అంద‌రికీ తెలిసిన క‌థ కావ‌డంతో? ఎమోష‌న్ క్యారీ చేయ‌డం అంత సుల‌భం కాదు. ఈ నేప‌థ్యంలో రెండ‌వ భాగం క‌థ మొద‌టి భాగాన్ని ఎక్క‌డ ముగించారో? అక్క‌డ నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. మ‌రి ఈ విమ‌ర్శ‌లు, స‌వాళ్ల‌ను దాటి ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ రెండ‌వ భాగాన్ని ఎంత ఎంగేజింగ్ గా చెబుతారు? అన్న‌ది చూడాలి.