బాక్సాఫీస్ డౌన్.. కాస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అప్: గండంలో స్టార్ హీరో మార్కెట్!
బాలీవుడ్లో దశాబ్దాలుగా తిరుగులేని బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని ఏలిన భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రస్తుతం అత్యంత సవాలుతో కూడిన మలుపులో పడింది.
By: Srikanth Kontham | 23 Oct 2026 4:00 PM ISTబాలీవుడ్లో దశాబ్దాలుగా తిరుగులేని బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని ఏలిన భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రస్తుతం అత్యంత సవాలుతో కూడిన మలుపులో పడింది. ఒకప్పుడు సింగిల్ హ్యాండ్‌తో రికార్డులను బద్దలు కొట్టిన స్టార్ హీరో, ఇప్పుడు బాక్సాఫీస్ ఫలితాలకే పరిమితం కాకుండా ఊహించని భద్రతా సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సరికొత్త పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాతలలో వ్యక్తమవుతున్న ఆలోచనా ధోరణి.. సినిమా ఇండస్ట్రీలో నూతన చర్చకు తెరలేపింది.
సల్మాన్ ఖాన్ గత సినిమాలైన `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్`.. అలాగే ఇటీవలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆయన మార్కెట్ పై కొంత ప్రభావాన్ని చూపింది. కేవలం స్టార్ డమ్ ఉంటే సరిపోదని.. నేటి ప్రేక్షకుల రుచికి తగినట్లుగా బలమైన కంటెంట్ కూడా ఉండాలని ఈ ఫలితాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఆయనతో కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించే విషయంలో పునరాలోచనలో పడటం గమనార్హం.
ఈ బాక్సాఫీస్ ఆందోళనల కంటే ఎక్కువగా? సల్మాన్ ఖాన్ చుట్టూ అల్లుకున్న భద్రతా సమస్యలు చిత్ర పరిశ్రమను కలవరపెడుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వస్తున్న హెచ్చరికలు.. గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలు ఆయనను నిరంతరం ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వెలుగుచూసిన ఇతర భద్రతా ఉదంతాలు కూడా సల్మాన్ భద్రతపై చిత్రసీమలో తీవ్రమైన చర్చకు దారితీశాయి.
ఈ భద్రతా ముప్పు సల్మాన్ వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా ఆయన సినిమాల షూటింగ్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అవుట్డోర్ షెడ్యూల్స్ నిర్వహించడం, బహిరంగ ప్రదేశాలలో షూటింగ్‌లు ప్లాన్ చేయడం నిర్మాతలకు పెను సవాలుగా మారుతోంది. భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి రావడం వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడమే కాకుండా లాజిస్టికల్ ఇబ్బందులు కూడా ఎక్కువవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రాల ద్వారా గట్టి పునరాగమనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ల విజయం బాక్సాఫీస్ లెక్కలనే కాకుండా బాలీవుడ్లో ఆయనకున్న అగ్రపీఠాన్ని భవిష్యత్తులోనూ కాపాడుకోవడానికి అత్యంత కీలకంగా మారనుంది. నిర్మాతలలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించడంలో ఈ చిత్రాల సక్సెస్ కీలక పాత్ర పోషిస్తుంది.
మొత్తంగా సల్మాన్ ఖాన్ కెరీర్లో ఎన్నో వివాదాలను.. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నటనపైనే కాకుండా భద్రత ..నిర్మాణ వ్యయాల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్టమైన దశను సల్మాన్ ఎలా దాటి వస్తారనేది బాలీవుడ్ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.
