మళ్లీ పెదనాన్న కాబోతున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ డ్రామా, ఒక సినిమాకు ఎంతమాత్రం తీసిపోదు. సల్మాన్ ఖాన్ నాలుగు సార్లు ప్రేమలో విఫలమయ్యాడు.
By: Sivaji Kontham | 1 Oct 2025 3:00 AM ISTబాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ డ్రామా, ఒక సినిమాకు ఎంతమాత్రం తీసిపోదు. సల్మాన్ ఖాన్ నాలుగు సార్లు ప్రేమలో విఫలమయ్యాడు. అతడిని ప్రేమించిన కథానాయికలు అందరూ చివరికి అతడికి దూరమయ్యారు. పెళ్లి చేసుకోవాలని సీరియస్ గా ప్రయత్నించిన ప్రతిసారీ అతడు విఫలమయ్యాడు. చివరి నిమిషంలో అతడి ఫేట్ మారిపోయింది. సల్మాన్ ప్రియురాళ్లలో అత్యంత చర్చనీయాంశమైన ఐశ్వర్యారాయ్, కత్రిన కైఫ్ లాంటి కథానాయికలు స్టార్లను పెళ్లాడి లైఫ్ లో సెటిలయ్యారు.
సల్మాన్ సోదరులు సోహెయిల్ ఖాన్, ఆర్భాజ్ ఖాన్ జీవితాలు కూడా బ్రేకప్ కారణంగా నిస్సారంగా మారాయి. సోహెయిల్ సీమ సజ్దే నుంచి విడిపోయాడు. అతడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆర్భాజ్ ఖాన్ కూడా మలైకా అరోరా నుంచి విడిపోయాడు. ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఆర్భాజ్ ఖాన్ తన మేకప్ ఉమెన్ షురా ఖాన్ ని పెళ్లాడాడు.
అతడు ఇటీవలే తండ్రిని కాబోతున్నానని శుభవార్త చెప్పాడు. చాలా కాలానికి సల్మాన్ కుటుంబంలో ఒక శుభకరమైన వేడుక జరిగింది. అర్బాజ్ ఖాన్ భార్య షురా ఖాన్ బేబీ షవర్ వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించగా, అతిథులతో సల్మాన్ ఇల్లు కళకళలాడింది. మొత్తానికి సల్మాన్ ఖాన్ పెదనాన్న కాబోతున్నాడు. ఆసక్తికరంగా బేబి షవర్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫ్స్ లో సీనియర్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఒంటరిగా కనిపించలేదు. ఈవెంట్ ఆద్యంతం అతడితో పాటు ప్రముఖ రియాలిటీ షో క్వీన్ జన్నత్ జుబైర్ కూడా కనిపించింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ అతడి కుమారుడు నిర్వాన్, అర్పితా ఖాన్ ..వారి తల్లి సుశీలా చరక్ సహా ఖాన్ కుటుంబంలోని సభ్యులంతా హాజరయ్యారు. ఈ బేబీ షవర్ వేడుకలో అర్బాజ్ మాజీ భార్య మలైకా అరోరా కుమారుడు అర్హాన్ ఖాన్ వేడుకకు హాజరయ్యారు. రవి దుబే, అతని భార్య సర్గుణ్ మెహతా, నియా శర్మ కూడా వేడుకలో సందడి చేసారు.
నిజానికి 2023లో ఆర్భాజ్- షురా ఖాన్ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఈ సంవత్సరం ప్రారంభంలో చాలా ఊహాగానాలు, పుకార్ల తర్వాత షురా గర్భం దాల్చిన వార్తను అర్బాజ్ ధృవీకరించారు. 57 ఏళ్ల వయసులో ఆర్భాజ్ రెండో సారి తండ్రి అవుతుంటే, సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికీ తన బ్యాచిలర్ షిప్ ని కాపాడుకుంటున్నాడు. పుట్టబోయే బిడ్డ అమ్మ కడుపులో ఉండగానే సల్మాన్ ని పెదనాన్న అని కలవరిస్తున్నాడట! మరోవైపు సోహెయిల్ ఖాన్ తన కుమారుడిని పెంచి పెద్దవాడిని చేయడమే ధ్యేయంగా జీవిస్తున్నాడు.
