Begin typing your search above and press return to search.

విమర్శలకు చోటు.. నెట్టింట మొదలైన చర్చ!

అసలు విషయంలోకి వెళ్తే.. సౌదీ అరేబియాలోని రియాజ్ వేదికగా "జాయ్ ఫోరమ్ 2025" ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

By:  Madhu Reddy   |   21 Oct 2025 2:00 AM IST
విమర్శలకు చోటు.. నెట్టింట మొదలైన చర్చ!
X

సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరు చేసే ఏ కామెంట్స్ అయినా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే సెలబ్రిటీలు ఈ కామెంట్స్ తెలిసి చేస్తారా లేక తెలియక చేస్తారా అనే విషయం అర్థం కాక నెట్టింట సరికొత్త చర్చ మొదలవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్లు విమర్శలకు చోటు ఇవ్వడమే కాకుండా నెట్టింట సరికొత్త చర్చను మొదలుపెట్టేలా చేశాయి. మరి సల్మాన్ ఖాన్ చేసిన ఆ కామెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. సౌదీ అరేబియాలోని రియాజ్ వేదికగా "జాయ్ ఫోరమ్ 2025" ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా ఖాన్ త్రయం హాజరయ్యి వేడుకను మరింత స్పెషల్ గా తీర్చిదిద్దారు. ఈ ఈవెంట్ లో భాగంగానే సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీసాయి. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. "దక్షిణాది కమ్యూనిటీలో భారతీయ సినిమాపై పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ సినిమాను ఇక్కడ సౌదీ అరేబియాలో రిలీజ్ చేస్తే అతి తక్కువ సమయంలోనే వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది. ఒక హిందీ సినిమానే కాదు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా భారతీయ భాషకు సంబంధించిన ఏ చిత్రమైనా సరే ఇక్కడ మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది.

దీనికి కారణం వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసించడమే. ముఖ్యంగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బలోచిస్థాన్ దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు" అంటూ సల్మాన్ ఖాన్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఈ విషయంపై చర్చించడం మొదలుపెట్టారు. ఎందుకంటే బలోచిస్థాన్, పాకిస్థాన్ అంటూ ఈ ప్రాంతాలను వేరు చేసి సల్మాన్ ఖాన్ కామెంట్ చేయడమే ఇక్కడ ప్రధాన చర్చకు కారణం.. వాస్తవానికి పాకిస్థాన్ లో బలోచిస్థాన్ ఒక భాగం అన్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ బలోచిస్థాన్ నెటిజన్స్ మాత్రం తమను ఏ దేశంలోకి కలపకండి అని.. తమది స్వతంత్ర దేశం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది సల్మాన్ ఖాన్ తెలిసి కామెంట్ చేశారా? తెలియక చేశారా ? అంటూ చర్చిస్తున్నారు. ఇంకొంతమంది సల్మాన్ ఖాన్ పాకిస్థాన్ నుండి బలోచిస్థాన్ ప్రజలను వేరు చేశారు.. ఇది అద్భుతం అంటూ కామెంట్లు చేశారు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నెట్టింట చర్చ మొదలుపెట్టారు. మరి దీనిపై సల్మాన్ ఖాన్ లేదా ఆయన టీం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

వాస్తవానికి పాకిస్థాన్ లోని అతిపెద్ద ప్రావిన్స్ బలోచిస్థాన్.. చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కి ఇది అతి ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ బంగారం, రాగి , ఇనుము, బొగ్గు, సహజ వాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఖజానా నింపుతోంది కూడా బలోచిస్తాన్ అని చెప్పవచ్చు. అయితే దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఈ రాష్ట్రం వాటా కేవలం 5% మాత్రమే. కఠినమైన ఎడారి ప్రాంతం.. సాగు భూమి లేకపోవడంతో ప్రజలు కూడా ఇక్కడ తక్కువగానే నివసిస్తున్నారు. పైగా పేదరికం.. ప్రజలు ఎక్కువగా లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. అయితే అనిశ్చితి కారణంగా వేర్పాటుదారులు శక్తివంతులై.. తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా మార్చుకోవాలని.. గత కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసాయి.