ఏంటయా 'మొట్టై బాస్'! ఏంటా లుక్కు? స్టార్ హీరోపై పంచ్‌లే పంచ్‌లు!
ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ తన `బజరంగీ భాయ్‌జాన్` కో-స్టార్ కరీనా కపూర్‌తో కలిసి మీడియాకు ప్రత్యేకంగా పోజులిచ్చారు.
By: Sivaji Kontham | 14 Jun 2026 10:21 AM ISTబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రతిష్టాత్మక చిత్రం `లగాన్` విడుదలై జూన్ 15 నాటికి విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముంబైలో గ్రాండ్ రీయూనియన్ వేడుకలు జరిగాయి. ఆస్కార్ నామినేషన్ సాధించిన ఈ క్లాసిక్ మూవీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు చిత్రయూనిట్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులంతా తరలివచ్చారు. జూహీ చావ్లా, కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ లాంటి టాప్ సెలబ్రిటీలు ఎందరో హాజరైనా అందరి దృష్టి మాత్రం ఒక్కరిపైనే పడింది. ఆయనే బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్. ఈ వేడుకకు సల్మాన్ సరికొత్త లుక్‌తో ఎంట్రీ ఇచ్చి అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు.
సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్‌కు సరికొత్తగా గుండు లుక్‌తో రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో.. సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టాప్ టు బాటమ్ బ్లాక్ అవుట్‌ఫిట్ , జర్కిన్ ధరించి.. మెడలో సిల్వర్ చైన్‌తో సరికొత్త స్వాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ భాయ్.. థియేటర్లలో రచ్చ లేపే ఒక గ్యాంగ్‌స్టర్ లా కనిపించారు. ఆయన కాన్ఫిడెంట్‌గా కెమెరాలకు పోజులిస్తుంటే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే సల్మాన్‌ను ఇలాంటి భిన్నమైన రగ్గడ్ లుక్‌లో చూడగానే సౌత్ సినీ ప్రియులు.. ముఖ్యంగా తమిళ తంబీలంతా ``ఏంటయ్యా.. మొట్టై బాస్! ఏంటా లుక్కు?`` అంటూ సోషల్ మీడియాలో క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
తమిళంలో `మొట్టై` అంటే `గుండు` అని అర్థం. గతంలో రజనీకాంత్ `శివాజీ` సినిమాలో గుండు లుక్‌ను `మొట్టై బాస్` అని పిలిచిన ట్రెండ్‌ను గుర్తుచేస్తూ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ను కూడా అదే పేరుతో ఆటపట్టిస్తున్నారు. కేవలం తమిళ ప్రేక్షకులే కాదు... తెలుగు ఫ్యాన్స్ సైతం భాయ్‌జాన్ కొత్త అవతారాన్ని చూసి మురిసిపోతూ `గుండు బాస్` అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అటు కన్నడిగులు కూడా తమ వాడుక భాషలో సల్మాన్ ఖాన్ పర్సనాలిటీకి, ఈ మాస్ లుక్‌కు కనెక్ట్ అయిపోయి `దొడ్డ (గుండు) బాస్` అంటూ నెట్టింట పిలిచేస్తున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ గుండు లుక్ ఇప్పుడు పాన్-ఇండియా లెవెల్లో తెగ వైరల్ అవుతోంది. జవాన్ లో షారూఖ్ గుండు లుక్ కంటే సల్మాన్ గుండు లుక్ ఇంకా డిఫరెంటుగా ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ తన `బజరంగీ భాయ్‌జాన్` కో-స్టార్ కరీనా కపూర్‌తో కలిసి మీడియాకు ప్రత్యేకంగా పోజులిచ్చారు. కరీనా సాఫ్ట్ పింక్ చుడీదార్‌లో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించగా.. హోస్ట్ అమీర్ ఖాన్ వీరిద్దరినీ ఎంతో ఆత్మీయంగా కౌగిలించుకుని వేడుకలోకి ఆహ్వానించారు. ముగ్గురు టాప్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫోటోగ్రాఫర్లకు, అభిమానులకు వేడుక కన్నుల పండువగా మారింది. లగాన్ చిత్రంలో నటించిన రాజేంద్రనాథ్ జుట్షీ, యశ్‌పాల్ శర్మ, ఆదిత్య లాఖియా వంటి నటీనటులతో పాటు దర్శకుడు అశుతోష్ గోవారికర్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
మరోవైపు ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అమీర్ ఖాన్ కుటుంబానికి ఒక పెద్ద ఫ్యామిలీ ఈవెంట్‌లా మారిపోయాయి. అమీర్ ఖాన్ తన కాబోయే భార్య గౌరీ స్ప్రాట్‌తో కలిసి ఈ వేడుకలో ప్రత్యేకంగా సందడి చేశారు. జూలై 4న వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తల నడుమ ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. వీరితో పాటు అమీర్ మాజీ భార్య కిరణ్ రావు, కుమారుడు ఆజాద్ రావు ఖాన్, కూతురు ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ కూడా హాజరై సందడి చేశారు. ఏదేమైనా `లగాన్` 25 ఏళ్ల సంబరాల్లో అమీర్ ఖాన్ పెళ్లి ముచ్చట్లు ఒక ఎత్తయితే... మన `మొట్టై బాస్` సల్మాన్ ఖాన్ గుండు లుక్ మాత్రం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి.
