ఈజిప్ట్ ప్రీమియర్‌లో స్టార్ హీరో హవా
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అశేష అభిమాన గణం మరోసారి నిరూపితమైంది.
By: Srikanth Kontham | 23 May 2026 1:00 PM ISTబాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అశేష అభిమాన గణం మరోసారి నిరూపితమైంది. తాజాగా ఈజిప్టులో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యాక్షన్ చిత్రం `7 డాగ్స్` ప్రీమియర్ వేడుకల్లో సల్మాన్ ఖాన్ అద్భుతమైన స్టార్‌డమ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రంలో ఆయన చిన్న ప్రత్యేక పాత్ర పోషించినా? ఈవెంట్ అంతటా ఆయన పోస్టర్లే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన నటీనటులు రెడ్ కార్పెట్‌పై మెరిసినా? అక్కడ ఏర్పాటు చేసిన భారీ సల్మాన్ ఖాన్ పోస్టర్లు అభిమానులను .. మీడియాను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈజిప్ట్ ప్రీమియర్ వేడుకకు సల్మాన్ ఖాన్ స్వయంగా అటెండ్ కాకపోయినా? ఆయన లీడ్ క్యారెక్టర్ లుక్‌తో కూడిన భారీ బ్యాక్‌డ్రాప్ పోస్టర్లు సందడి చేశాయి.
ఈవెంట్‌కు విచ్చేసిన అభిమానులు ఆ పోస్టర్ల ముందు నిలబడి సెల్ఫీలు దిగడానికి, ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. అరబ్ దేశాల అగ్ర నటులైన కరీమ్ అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఎజ్జ్ వంటి వారు రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో కూడా అందరి కళ్లూ సల్మాన్ ఖాన్ పోస్టర్‌పైనే నిలవడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇది సల్మాన్ ఖాన్ కు ఉన్న గ్లోబల్ ఇమేజ్ స్థాయిని తెలియజేస్తోంది. అలాగే సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్ లోపల చిత్రీకరించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌చల్ చేస్తోంది.
ఇందులో సల్మాన్ ఖాన్ ఒక బార్బర్ షాప్ నేపథ్యంలో సాగే సన్నివేశంలో పూర్తిగా ఆంగ్లంలో డైలాగులు చెబుతూ కనిపించారు. చిత్ర కథానాయకులు కరీమ్ అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఎజ్జ్ ఆయనను సంప్రదించే ఈ సీన్ థియేటర్లలో ఉన్న ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. సల్మాన్ ఖాన్ ఆంగ్లంలో డైలాగులు పలికిన విధానం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఈ క్యామియో ప్రదర్శన చూసిన అభిమానులు నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. `ఇది చిన్న పాత్ర మాత్రమే కావచ్చు. కానీ థియేటర్లలో దీని ఇంపాక్ట్ మాస్ డిస్ట్రక్షన్ రేంజ్‌లో ఉంది` అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరు `ఇలాంటి అంతర్జాతీయ సినిమాలో భాయ్‌జాన్‌ను చూడటం అద్భుతంగా ఉంది. పక్కా పైసా వసూల్ ఎంట్రీ` అంటూ తమ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కొన్ని నిమిషాల పాత్రతోనే సినిమా వాతావరణాన్ని పండు గలా మార్చడం సాధారణ స్టార్‌కు సాధ్యం కాదని అది కేవలం మెగాస్టార్‌కే సాధ్యమని నెటిజన్లు కొనియా డుతున్నారు. `బ్యాడ్ బాయ్స్` వంటి ప్రసిద్ధ హాలీవుడ్ ఫ్రాంచైజీ చిత్రాలను తెరకెక్కించిన ఎల్ అర్బి, బిలాల్ ఫల్లా `7 డాగ్స్` చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మిడిల్ ఈస్ట్‌లో ఓ ప్రమాదకరమైన ఆయుధ డ్రగ్ వ్యాప్తి చెందడం వల్ల తలెత్తే అంతర్జాతీయ సంక్షోభం చుట్టూ తిరుగుతుంది.
ఇందులో అహ్మద్ ఎజ్జ్ ఇంటర్‌పోల్ అధికారిగా, కరీమ్ అబ్దెల్ అజీజ్ నేర సామ్రాజ్యానికి అధిపతిగా భిన్నమైన ప్రపంచాలకు చెందిన పాత్రలలో నటించారు. సౌదీ అరేబియా వినోద రంగ ప్రముఖుడు తుర్కి అల్-షేక్ స్క్రిప్ట్ అందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్‌తో పాటు మరో సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఒక కీలక క్యామియో పాత్రలో మెరిశారు. అంత ర్జాతీయ ప్రాజెక్ట్‌లలో భారతీయ నటీనటుల భాగస్వామ్యం పెరుగుతున్న తరుణంలో, సల్మాన్ ఖాన్ అరబిక్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ చిత్రంలో భాగం కావడం బాలీవుడ్ గ్లోబల్ రీచ్‌ను మరింత పెంచుతుంది. మిడిల్ ఈస్ట్ దేశాలలో సల్మాన్‌కున్న క్రేజ్‌ను వాడుకోవడానికి మేకర్స్ ప్రత్యేక పాత్రను ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సృష్టిస్తున్న ట్రెండ్ సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రాల మార్కెట్‌కు కూడా పెద్ద ప్లస్ కానుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో `మాతృభూమి`అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
