ఐష్ వదిలి వెళ్లిపోయాక సల్మాన్ ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు
ఐశ్వర్యారాయ్ తన జీవితం నుంచి వెళ్లిపోయాక అతడు ఎంతగా విలపించాడో, ఇప్పుడు గీత రచయిత సమీర్ అంజాన్ రివీల్ చేసారు.
By: Sivaji Kontham | 28 Sept 2025 12:45 AM ISTసల్మాన్ ఖాన్ జీవితం నుంచి చాలా మంది వెళ్లిపోయారు. అతడు కనీసం నాలుగు సార్లు అయినా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అందుకే 60 ప్లస్ లో అతడు స్టిల్ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. సోమి అలీ, ఐశ్వర్యారాయ్, లులియా వాంటూర్, కత్రిన కైఫ్ ఇలా వరుసగా అతడి జీవితంలోకి వచ్చి వెళ్లినవారే. వీళ్లు మాత్రమే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు.
అయితే ప్రియురాళ్లు తనను వదిలి వెళ్లిపోవడంతో తప్పంతా తనదేనని సల్మాన్ ఆత్మనిందకు కూడా సిద్ధమయ్యాడు. నలుగురైదుగురు జీవితం నుంచి వెళ్లిపోయినప్పుడు అది మన తప్పు అని అనుమానించడం ప్రారంభమవుతుంది.. నేను వారికి కావలసిన జీవితాన్ని, ఆనందాన్ని అందించలేననే భయం నాది అని సల్మాన్ అంగీకరించాడు.
అయితే సల్మాన్ జీవితంలో ఐశ్వర్యారాయ్ ఎపిసోడ్ చాలా వినాశకరమైనది. అతడి పరువు మర్యాదలు పబ్లిగ్గా గంగలో కలిసిపోయిన సందర్భమది. సల్మాన్ పిచ్చి పోకడలు, తిట్టి కొట్టడం గురించిన దుష్ప్రవర్తనపై ఐశ్వర్యారాయ్ బహిరంగంగా వ్యాఖ్యానించడంతో అతడు పూర్తిగా ముక్క చెక్కలైన హృదయంతో కన్నీరుమున్నీరయ్యాడు.
ఐశ్వర్యారాయ్ తన జీవితం నుంచి వెళ్లిపోయాక అతడు ఎంతగా విలపించాడో, ఇప్పుడు గీత రచయిత సమీర్ అంజాన్ రివీల్ చేసారు. అతడు మాట్లాడుతూ.. ఐశ్వర్యారాయ్ నుంచి విడిపోయిన తర్వాత సల్మాన్ `తేరే నామ్` టైటిల్ ట్రాక్ వింటూ ఏడ్చేవాడని వెల్లడించారు. `తేరే నామ్` టైటిల్ ట్రాక్‌ను సల్మాన్ ఖాన్‌ను దృష్టిలో ఉంచుకుని రాయలేదు. కానీ ఐశ్వర్య రాయ్ నుంచి విడిపోయిన తర్వాత, ఆ పాట అతడి వ్యక్తిగత హార్ట్ బ్రేకింగ్ పాటగా మారింది. ఆ పాట కోసం సన్నివేశాలను చిత్రీకరించే ముందు సల్మాన్ హిమేష్ రేషమ్మియాకు ఫోన్ చేసి, దానిని పాడమని అడిగి కన్నీళ్లతో విలపించేవాడని తెలిపాడు.
సల్మాన్ ని గాయాలు బాధిస్తున్నాయి. ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. ప్రతిసారీ షాట్ కి వచ్చే ముందు రేషమ్మియాతో పాడించుకుని మరీ ఏడ్చేసేవాడు. ముఖ్యంగా `క్యూం కిసికో వఫా కే బద్లే వఫా నహీ మిల్తీ` అనే లైన్ - ఐశ్వర్యను చేరుకోవాలని, ఆమె తన బాధను అనుభవించాలని కోరుకున్నాడు.. అని లిరిసిస్ట్ వెల్లడించాడు.
సల్మాన్ ఖాన్ కొంతకాలంగా పరాజయాల బాటలో ఉన్నాడు. మురుగదాస్ తో సికందర్ ఫెయిలయ్యాక, ప్రస్తుతం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ షూటింగ్‌లో ఉన్నారు. మరోవైపు బిగ్ బాస్ 19 హోస్ట్‌గాను బిజీగా ఉన్నారు. ఆర్యన్ ఖాన్ షో, ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్‌లో కూడా అతిధి పాత్ర పోషించాడు. అమీర్ ఖాన్ తో కలిసి ఇటీవల పాపులర్ టీవీ షోలోను పాల్గొన్నాడు.
