60ల్లో కూడా తగ్గని జోరు!
సల్మాన్ ఖాన్ విషయానికొస్తే.. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
By: Madhu Reddy | 10 Jan 2026 7:20 PM ISTప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు..ఆరుపదుల వయసులో కూడా రియల్ స్టంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఆ వీడియో చూసిన అభిమానులే కాదు నెటిజన్స్ , ఆఖరికి సినీ సెలబ్రిటీలు కూడా 60లలో కూడా సల్మాన్ ఖాన్ ఏమాత్రం జోరు తగ్గించలేదు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే..బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా అత్యంత ధనవంతుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు సల్మాన్ ఖాన్. ఈ నేపథ్యంలోనే ఆయన తన నివాసంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్ ని కూడా ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో భాగంగా పైనుంచి రియల్ స్టంట్ చేస్తూ పూల్ లోకి దూకి తన ఎనర్జీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సల్మాన్ ఖాన్ స్టంట్ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేయగా.. మరి కొంతమంది ఆరుపదుల వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సల్మాన్ ఖాన్ విషయానికొస్తే.. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తన నటనతో మూడు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ హీరోగా చెలామణి అవుతున్నారు. అంతేకాదు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడుగా పేరు దక్కించుకున్న సల్మాన్ ఖాన్.. తన కెరీర్ లో ఏకంగా నిర్మాతగా రెండు నేషనల్ అవార్డులు అందుకున్నారు అలాగే నటుడిగా రెండు ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు . అంతేకాదు అత్యధిక ప్రజాదారణ పొందిన నటుడిగా పేరు దక్కించుకున్నారు. అంతేకాదు 2015, 2018 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా రికార్డ్ సృష్టించాడు.
ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. చివరిగా సికందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా అంకూర్ భాటియా తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటుడు గానే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా పేరు దక్కించుకున్నారు సల్మాన్ ఖాన్.
