వయసు కేవలం నెంబర్ మాత్రమే.. ట్రోలర్లకు సల్మాన్ సాలిడ్ కౌంటర్!
అయితే సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్ పేజీ `adultsociety` పోస్ట్ కింద) నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
By: Sivaji Kontham | 20 Sept 2026 12:55 PM ISTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల బిగ్‌బాస్ షోలో భాగంగా ప్రదర్శించిన ఫిజిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే నటీమణులపై జరిగే ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండించడంతో పాటు.. తన వయసుపై వస్తున్న విమర్శలకు ఖాన్ తనదైన శైలిలో గట్టి సమాధానం ఇచ్చారు. ఈ పరిణామం నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారితీసింది.
`బిగ్‌బాస్ వీకెండ్ కా వార్` ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. పబ్లిక్‌గా నటీమణుల విషయంలో ఫోటోగ్రాఫర్ల వ్యవహారశైలిపై మండిపడ్డారు. ముఖ్యంగా అంబానీ పూజల వద్ద సెలబ్రిటీలపై జరిగిన బాడీ షేమింగ్ కామెంట్లు, ట్రోల్స్‌ను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎప్పుడూ తన సహనటీమణుల రక్షణగా నిలిచే సల్మాన్ ఈసారి కూడా వారిని కించపరిచే వారిపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కత్రినకు అతడు బాసటగా నిలవడంతో.. అభిమానులు దీన్ని `టైగర్-జోయా` బంధంతో పోలుస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఎపిసోడ్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ తన టోపీ, జాకెట్‌తో పాటు టీషర్ట్ విప్పి తన టోన్డ్ ఫిజిక్‌ను కెమెరా ముందు ప్రదర్శించారు. 60 ఏళ్ల వయసులోనూ అతడి ఫిట్‌నెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కుషాల్ టాండన్ స్పందిస్తూ..ఎలాంటి వీఎఫ్‌ఎక్స్ లేకుండా కేవలం కఠినమైన క్రమశిక్షణ, అంకితభావంతోనే ఈ ఫిజిక్ సాధ్యమని కొనియాడారు. సల్మాన్ డెడికేషన్‌ను ప్రతి ఒక్కరూ అభినందించాలని పేర్కొన్నారు.
అయితే సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్ పేజీ `adultsociety` పోస్ట్ కింద) నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు అభిమానులు 60 ఏళ్ల వయసులోనూ ఆయన మైంటైన్ చేస్తున్న లుక్స్‌ను ప్రశంసిస్తూ ఫిట్‌నెస్ ఐకాన్ అని కీర్తించారు. మరికొందరు మాత్రం ఇవి ఏఐ (AI) ఎడిటెడ్ ఫోటోలని లేదా సప్లిమెంట్ల ప్రభావమని ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టారు. వయసు పైబడుతున్న విషయాన్ని అంగీకరించాలని కొందరు ట్రోల్ చేయగా... వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమేనని అభిమానులు సమర్థించుకున్నారు.
మొత్తానికి సల్మాన్ ఖాన్ తన ఫిజిక్‌తో మరోసారి తనపై వస్తున్న విమర్శలకు, ట్రోల్స్‌కు చెక్ పెట్టారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఆరా తగ్గలేదని.. ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే భాయ్ ని టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నా కానీ..భాయ్‌జాన్ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. సల్మాన్ నటించిన మాతృభూమి చిత్రం విడుదలకు రావాల్సి ఉంది. ఈ సినిమా సెన్సార్ విషయమై సీబీఎఫ్ సీకి అభ్యంతరాలున్నాయని సమాచారం. మరోవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంలోను సల్మాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
