ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ 2 ఎప్పుడంటే?
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఒకవైపు స్పిరిట్, మరోవైపు ఫౌజీ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
By: M Prashanth | 2 March 2026 7:54 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్! డార్లింగ్ లీడ్ రోల్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న సలార్ 2పై ఎట్టకేలకు అధికారిక అప్డేట్ వచ్చింది. ఆ సినిమా ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో ఆసక్తి నెలకొంది. దీంతో ఇప్పుడు సలార్ 2 నిర్మాత కీలక అప్డేట్ ఇవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ తాజా అప్డేట్ ఇచ్చారు. అభిమానుల నుంచి రోజూ సీక్వెల్ పై ప్రశ్నలు వస్తున్నాయని, అందుకే ప్రత్యేకంగా స్పందిస్తున్నామని తెలిపారు. సలార్ 2ను భారీ స్థాయిలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈసారి స్టోరీ, యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్స్ అన్నీ మరింత గ్రాండ్ గా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
అయితే సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మాస్ యాక్షన్, ఎమోషన్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను కల్ట్ రేంజ్ లో తీసుకెళ్లాయి. థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా ఆ సినిమా అత్యధిక వ్యూస్ సాధించి ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. దీంతో రెండో పార్ట్ పై ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగాయి.
ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ తన మేకింగ్ స్టైల్ తో ఇప్పటికే భారీ యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ గా మారారు. ఆయన తెరకెక్కించే ప్రతి ప్రాజెక్ట్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని ప్రేక్షకులు, అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు సలార్ 2 విషయంలో కూడా అదే రేంజ్ లో యాక్షన్, డ్రామా, ఎమోషన్ మిక్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఒకవైపు స్పిరిట్, మరోవైపు ఫౌజీ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాగే కల్కి 2898 ఏడీ సీక్వెల్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఆ కమిట్మెంట్ల కారణంగా సలార్ 2 ఆలస్యమైందనే ప్రచారం జరిగింది. అయితే అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాక సలార్ సీక్వెల్ పై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా భారీ చిత్రం డ్రాగన్ తో బిజీగా ఉన్నారు. దీంతో ఇద్దరి షెడ్యూల్స్ సెట్ అయిన వెంటనే సలార్ 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏదేమైనా సలార్ 2 కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, మాస్ ప్రేక్షకులకు పండుగలా ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా ఎగ్జైటింగ్ న్యూస్ అని చెప్పాలి!
