Begin typing your search above and press return to search.

‘సలార్ 2’పై బిగ్ అప్డేట్.. అదే టైమ్‌లో రిలీజ్ కన్‌ఫర్మ్!

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న 'సలార్ 2' షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది.

By:  Madhu Reddy   |   18 Aug 2026 11:50 AM IST
‘సలార్ 2’పై బిగ్ అప్డేట్.. అదే టైమ్‌లో రిలీజ్ కన్‌ఫర్మ్!
X

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్ 2: శౌర్యాంగపర్వం'. మొదటి భాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్' థియేటర్లలో తెచ్చిన తుఫాన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ షూటింగ్ రిలీజ్ కి సంబంధించి, ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. మరి ఆ అప్డేట్ పైన మనము ఓ లుక్ వేద్దాం..

మళ్ళీ మొదలుకానున్న ఖాన్సార్ రచ్చ:

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న 'సలార్ 2' షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది. మిగతా చిత్రీకరణను వచ్చే ఏడాదిలోనే అంటే 2027లో పూర్తి చేయాలని మేకర్స్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇక ఖాన్సార్ సామ్రాజ్యంలో దేవ, వరదరాజ మన్నార్ ల మధ్య రాబోయే అసలైన యుద్ధం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ తాజా క్లారిటీతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ నీల్ బిజీ:

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి 'డ్రాగన్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, 2027 ప్రారంభం నాటికే దీన్ని పూర్తి చేయాలని నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా పనులు ముగియగానే ప్రశాంత్ నీల్ తన దృష్టినంతా పూర్తిగా 'సలార్ 2' పైనే పెట్టనున్నారు.

వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ హడావిడి:

మరోవైపు ప్రభాస్ కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'ఫౌజీ' చిత్రం ముగింపు దశకు చేరుకుంది. అలాగే 'స్పిరిట్', 'కల్కి 2' చిత్రాల షూటింగ్‌లు కూడా రీసెంట్‌గానే మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్ వచ్చేలోగా ప్రభాస్ తన 'ఫౌజీ', 'స్పిరిట్' షూటింగ్స్ ఒక కొలిక్కి తీసుకురానున్నారు.

2027 చివర్లో సెట్స్ పైకి 'సలార్ 2' :

ఇరువరి షెడ్యూల్స్ ని బట్టి చూస్తే, అన్ని అనుకూలిస్తే 2027 చివరి నాటికి 'సలార్ 2' మిగతా షూటింగ్ పూర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. హోంబళే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ పార్ట్ 2 లో అంతకు మించి ఉండేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఈలోపు ఎన్టీఆర్ డ్రాగన్ రెండు భాగాలూ పూర్తి చేసేస్తారా లేదా అనేది చూడాలి.

దేవ, వరదరాజ మన్నార్ల మధ్య సాగే అసలు సిసలైన డ్రామా మరియు భారీ యాక్షన్ సీన్లు పార్ట్ 2 లో ప్రేక్షకులకు పీక్స్ లో పూనకాలు తెప్పించడం ఖాయం. పక్కా ప్లానింగ్ తో వస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది.