Begin typing your search above and press return to search.

డైనోసార్ ఈజ్ బ్యాక్.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తర్వాతే ప్రభాస్ కాంబో

డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి.

By:  M Prashanth   |   23 Oct 2026 4:26 PM IST
డైనోసార్ ఈజ్ బ్యాక్.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తర్వాతే ప్రభాస్ కాంబో
X

డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవైపు ఫౌజీ, కల్కి 2 హడావుడి నడుస్తుండగానే, మరోవైపు హోంబలే ఫిల్మ్స్ నుంచి మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'సలార్ 2' పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ డెడ్లీ కాంబినేషన్ లో రాబోయే ఈ క్రేజీ సీక్వెల్ పై మేకర్స్ అధికారికంగా ప్రకటన చేస్తూ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.





గత ఏడాది వచ్చిన 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించిందో తెలిసిందే. విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ వైలెంట్ మ్యాన్ అవతార్ కు మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతిబాబు, శ్రీయారెడ్డి లాంటి భారీ తారాగణంతో వచ్చిన ఆ చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది.





ఇప్పుడు ఫ్యాన్స్ అందరి చూపు 'సలార్ 2' పైనే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, సలార్ 2 ప్రీ-ప్రొడక్షన్ పనుల్లోకి నీల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంటే డ్రాగన్ పూర్తయితే గానీ సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లదు.

మరోవైపు ప్రభాస్ లైనప్ కూడా మామూలుగా లేదు. హను రాఘవపూడి 'ఫౌజీ', నాగ్ అశ్విన్ 'కల్కి 2', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' లాంటి భారీ ప్రాజెక్టులతో డార్లింగ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల షెడ్యూల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూనే, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు ప్రభాస్ తన డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. హీరోలను లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లలో, పక్కా మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేయడంలో ప్రశాంత్ నీల్ మార్క్ ఏంటో కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రూవ్ అయింది.

ఆయన సృష్టించే డార్క్ వరల్డ్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎలివేషన్స్ కు దేశవ్యాప్తంగా సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదటి భాగంలో కేవలం శాంపిల్ మాత్రమే చూపించిన నీల్, అసలైన వైలెన్స్ సెకండ్ పార్ట్ లోనే ఉండబోతోందని ఇదివరకే హింట్ ఇచ్చాడు. సలార్ పార్ట్ 1 ఘన విజయం సాధించడం, దానికి తోడు ప్రభాస్ నీల్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ నెక్స్ట్ చాప్టర్ పై అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.