Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌భాస్ ప‌క్క‌న పెట్టేశాడా?

ఈ మూవీ వ‌చ్చి రెండేళ్లు దాటింది. దీనికి సీక్వెల్‌గా `స‌లార్ పార్ట్ 2 శౌర్యాంగ‌ప‌ర్వం` చేయాల‌ని ప్లాన్ చేశారు.

By:  Tupaki Entertainment Desk   |   10 Feb 2026 3:38 PM IST
ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌భాస్ ప‌క్క‌న పెట్టేశాడా?
X

స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ల తొలి క‌ల‌యిక‌లో రూపొందిన భారీ యాక్ష‌న్ డ్రామా `స‌లార్‌`. 2014లో వ‌చ్చిన క‌న్న‌డ హిట్ ఫిల్మ్ `ఉగ్రం` మూల క‌థ‌ని తీసుకుని దానికి ఫాంట‌సీ అంశాల‌ని జోడించి ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. 2023,డిసెంబ‌ర్ 22న విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్‌ని సొంతం చేసుకున్నా కానీ ప్ర‌భాస్ చ‌రిష్మా కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది.

ఈ మూవీ వ‌చ్చి రెండేళ్లు దాటింది. దీనికి సీక్వెల్‌గా `స‌లార్ పార్ట్ 2 శౌర్యాంగ‌ప‌ర్వం` చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఇది ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. డైరెక్ట‌ర్ రెడీ అయినా ప్ర‌భాస్ అందుకు రెడీగా లేడ‌ని తెలుస్తోంది. కార‌ణం ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్నాడు. హ‌ను రాఘ‌వ‌పూడితో యుద్ధం నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఆధారంగా రూపొందుతున్న మూవీ `ఫౌజీ`లో న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం రాకెట్ స్పీడుతో జ‌రుగుతోంది.

ఇదే స‌మ‌యంలో ప్ర‌భాస్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి వంగ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ `స్పిరిట్‌` చేస్తున్నాడు. తొలిసారి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న సినిమా కావ‌డం, రేర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో దీనిపై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలున్నాయి. కాంచ‌న‌, ప్ర‌కాష్‌రాజ్‌, వివేక్ ఓబెరాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇటీవ‌లే డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ రిలీజ్ డేట్‌ని కూడా ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది మార్చి 5న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. దీని త‌రువాత `స‌లార్ 2`ని సెట్స్ పైకి తీసుకెళ్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది జ‌ర‌గ‌డం లేద‌ని, `స్పిరిట్‌` త‌రువాత ప్ర‌భాస్ `క‌ల్కి 2`ని మొద‌లు పెట్ట‌బోతున్నాడ‌ని తెలిసింది. `స‌లార్ 2` కంటే `క‌ల్కి2`పైనే ఎక్కువ ఆస‌క్తిని చూపిస్తున్న ప్ర‌భాస్ ఈ సీక్వెల్‌నే ముందు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా తెలుస్తోంది. డేట్స్‌, ముందుగా ఇచ్చిన క‌మిట్‌మెంట్‌ల కార‌ణంగా `కల్కి 2`కే ప్ర‌భాస్ అధిక ప్రాధాన్య‌తనిచ్చిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.

`క‌ల్కి` సక్వెల్‌ని ముందుకు తీసుకొచ్చి `స‌లార్ 2`ని వెన‌క్కి నెట్టిన‌ట్టుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో `డ్రాగ‌న్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ న‌టులు అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. దీని ప‌నుల్లో బిజీగా ఉన్న ప్ర‌శాంత్ నీల్ ఇప్ప‌ట్లో `స‌లార్ 2`ని ప‌ట్టాలెక్కించ‌డం అంత సులువు కాద‌ని, ఆ ఆక‌ర‌ణంగానే ప్ర‌భాస్ `స‌లార్ 2`ని ప‌క్క‌న పెట్టి `క‌ల్కి 2` సీక్వెల్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.