గ్రాజియా ఈవెంట్‌లో 'బమ్ డిగీ డిగీ' బ్యూటీ హొయలు..
'బమ్ డిగీ డిగీ' సాంగ్‌తో కుర్రకారు గుండెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాక్షి మాలిక్ తాజాగా జరిగిన గ్రాజియా ఫ్యాషన్ అవార్డ్స్ 2026 వేడుకలో తళుక్కుమంది.
By: Sivaji Kontham | 1 April 2026 3:00 PM IST'బమ్ డిగీ డిగీ' సాంగ్‌తో కుర్రకారు గుండెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాక్షి మాలిక్ తాజాగా జరిగిన గ్రాజియా ఫ్యాషన్ అవార్డ్స్ 2026 వేడుకలో తళుక్కుమంది. ఈ ఈవెంట్ కోసం సాక్షి ఎంచుకున్న వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. శ్వేత వర్ణపు దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతుంటే కెమెరా కళ్లు అన్నీ ఈ బ్యూటీపైనే నిలిచిపోయాయి. ఫ్యాషన్ విషయంలో తనదైన ముద్ర వేయడానికి సాక్షి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ వేడుక మరోసారి నిరూపించింది.
ముఖ్యంగా సాక్షి మాలిక్ ఇన్ స్టా వీడియోలో చూపిస్తున్న హొయలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇలా కెమెరా ముందు ఫోజులివ్వడమే కాదు.. తన సింపుల్ స్మైల్ తో పరిసరాల్లో వెలుగులు నింపింది. సాక్షి రాకతో కెమెరా ఫ్లాష్‌లు ఆగకుండా మెరుస్తూనే ఉన్నాయి. ఈ యంగ్ బ్యూటీ గ్రేస్ ..ఆత్మవిశ్వాసం రెడ్ కార్పెట్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందుకే నెటిజన్లు సైతం ''సాక్షి కేవలం ఫోజులివ్వలేదు.. ఆ సీన్ మొత్తాన్ని వెలిగించేసింది'' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
సాక్షి మాలిక్ తన కెరీర్ ప్రారంభంలో 'సోను కె టిటు కి స్వీటీ' సినిమాలోని స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో మ్యూజిక్ వీడియోస్ లో తన గ్లామర్‌తో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. ఫిట్‌నెస్ విషయంలో కూడా ఈ బ్యూటీ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్లే తన క్రేజ్‌కు నిదర్శనం.
ప్రస్తుతం సాక్షి మాలిక్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. 2026లో ఈ భామ రెండు బాలీవుడ్ ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు సమాచారం. అందులో ఒకటి ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం కాగా మరొకటి ఒక యంగ్ హీరో సరసన నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. కేవలం హిందీలోనే కాకుండా.. దక్షిణాది సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సాక్షి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కొన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఈ భామను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నటిగా తనని తాను నిరూపించుకోవడానికి వైవిధ్యమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు సాక్షి పలు సందర్భాల్లో పేర్కొంది. కేవలం ఐటెం సాంగ్స్ కోసం.. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. పెర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది సాక్షి మాలిక్ కెరీర్‌లో ఒక మలుపు కోసం ఎదురు చూస్తోంది.
