Begin typing your search above and press return to search.

బికినీ బీచ్ లో సాక్షి మాలిక్ బంచిక్ బమ్

ప్రముఖ మోడల్ కం నటి సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి సెన్సేషన్ సృష్టించింది.

By:  Sivaji Kontham   |   8 March 2026 8:00 PM IST
బికినీ బీచ్ లో సాక్షి మాలిక్ బంచిక్ బమ్
X

ప్రముఖ మోడల్ కం నటి సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి సెన్సేషన్ సృష్టించింది. బీచ్ నేపథ్యంలో బికినీ ధరించి ఈ బ్యూటీ ఇచ్చిన స్టన్నింగ్ భంగిమలు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సముద్రపు అలల సాక్షిగా సాక్షి ప్రదర్శించిన అందచందాలు, ముగ్ధ మ‌నోహ‌ర‌ రూపం ఈ ఫోటోషూట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫిట్‌నెస్ విష‌యంలో ఈ ముంబై డాళ్ కి ఉన్న మక్కువ ఆ స్లిమ్ అండ్ టోన్డ్ బాడీలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సన్‌సెట్ వెలుగులో సాక్షి గ్లామర్ మరింత రెట్టింపు అయ్యిందని చెప్పవచ్చు.




సాక్షి మాలిక్ కేవలం అందంపైనే కాకుండా తన బ‌ల శిక్ష‌ణ‌, ఆత్మవిశ్వాసంపై కూడా దృష్టి సారిస్తుందని ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి. `షి మూవ్స్ విత్ పర్ప‌స్, షి మూవ్స్ విత్ స్ట్రెంగ్త్` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ సాక్షిలోని దృఢత్వాన్ని చాటిచెబుతోంది. నీలిరంగు బికినీలో ఈ బ్యూటీ కనబరిచిన హొయలు, బీచ్ ఇసుకపై కెమెరాకు ఇచ్చిన ఫోజులు యూత్ లో సెగలు పుట్టిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న సాక్షి ఈ సరికొత్త లుక్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.




సాక్షి మాలిక్ లైఫ్ జర్నీ..

సాక్షి మాలిక్ తన కెరీర్‌ను ఒక మోడల్‌గా ప్రారంభించి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అనతి కాలంలోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రం `సోను కే టిటు కి స్వీటీ`లోని బొమ్ డిగి డిగి పాటతో సాక్షి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. కేవలం కొన్ని సెకన్ల పాటు ఆ పాటలో కనిపించినా సాక్షి అందం, ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఢిల్లీకి చెందిన ఈ భామ ఇంజనీరింగ్ చదివినా.. గ్లామర్ రంగంపై ఉన్న ఆసక్తితో ముంబైకి చేరుకుని తన కలను సాకారం చేసుకుంది.

ఈ బ్యూటీ ప్రయాణం కేవలం గ్లామర్ ఫోటోషూట్లకే పరిమితం కాలేదు. పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ఫిట్‌నెస్ అండ్ లైఫ్‌స్టైల్ విషయంలో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న సాక్షి నిరంతరం తన కెరీర్‌లో ఎదుగుతూనే ఉంది. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటూ.. కష్టపడి పని చేసే తత్వమే తన విజయానికి మూలమని నమ్ముతుంది.

మహిళా దినోత్సవ స్పెషల్ - కెరీర్ విశ్లేషణ:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి మాలిక్ తన ఇఎల్‌విఎన్ యాక్టివ్ బ్రాండ్ సహకారంతో ఈ స్పెషల్ లుక్‌ను షేర్ చేసింది. నిలకడగా ఉండటానికి నిరాకరించే ప్రతి మహిళకు అంకితమిస్తూ సాక్షి ఈ పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. మహిళా సాధికారతను, శారీరక దృఢత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ భామ షేర్ చేసిన ఫోటోలు కేవలం గ్లామర్ కోసమే కాకుండా.. మహిళల్లోని అంతర్గత శక్తిని ప్రతిబింబించేలా ఉన్నాయి. ప్రస్తుతం సాక్షి కొన్ని వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోల గురించి చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

సాక్షి కెరీర్ ఆశించిన స్థాయిలో వెలగకపోవడానికి ప్రధాన కారణం సరైన `బ్రేక్` ఇచ్చే పెద్ద సినిమాలు రాకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లామర్ పరంగా సాటిలేక‌పోయినా.. నటిగా తన ప్రతిభను నిరూపించుకునే బలమైన పాత్రలు ఇప్పటివరకు దక్కలేదు. సౌత్ భాషల్లో ముఖ్యంగా తెలుగులో ఓ సినిమాలో మెరిసినా కానీ మ‌ధ్య‌లో సాక్షి దాని నుంచి వైదొలిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి.. ఆ తర్వాత అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది. దక్షిణాది చిత్రసీమలో ప్రస్తుతం నటనతో పాటు భాషపై పట్టు, కమర్షియల్ హిట్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తుండటం సాక్షికి ఒక అవరోధంగా మారింది. అయితే తన సోషల్ మీడియా క్రేజ్ తో త్వరలోనే మరిన్ని అవకాశాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.