శంబాల టీమ్ నెక్స్ట్.. మరో గ్లామర్ టచ్..
ఇప్పుడు సాక్షి మడోల్కర్ ను కూడా మరో హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆమెకు వెల్కమ్ చెబుతూ పోస్టర్ విడుదల చేశారు.
By: M Prashanth | 13 Oct 2026 3:23 PM ISTసినిమా స్టోరీతో పాటు క్యాస్టింగ్ సెలెక్షన్ పై కూడా ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు దర్శక నిర్మాతలు. మంచి ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న కరికాల సినిమాలోనూ ఇదే కనిపిస్తోంది. శంబాల సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఆ మూవీలో మరో హీరోయిన్ గా సాక్షి మడోల్కర్ ఫిక్స్ అయ్యారు. దీంతో సినిమాకు మరో టాలెంట్ అండ్ గ్లామర్ టచ్ తోడైనట్లు అయింది.
శంబాల సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యుగంధర్ ముని.. ఇప్పుడు కరికాలతో మరోసారి తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఆ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. భారీ ఖర్చుతో, కొత్త తరహా కథతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచాయి.
రీసెంట్ గా మూవీలో హీరోయిన్ గా కేథరిన్ థ్రెసా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు సాక్షి మడోల్కర్ ను కూడా మరో హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆమెకు వెల్కమ్ చెబుతూ పోస్టర్ విడుదల చేశారు. దీంతో కరికాలలో హీరోయిన్ల సెలక్షన్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సాక్షి మడోల్కర్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మోగ్లీ సినిమాతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇప్పుడు వరుసగా కొత్త అవకాశాలు వస్తున్నాయి.
యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఇప్పుడు సందీప్ కిషన్ వంటి హీరోతో భారీ చిత్రంలో అవకాశం రావడం ఆమె కెరీర్ కు మరో ఛాన్స్ అని చెప్పాలి. సాక్షి కూడా తన అందంతో పాటు యాక్టింగ్ తో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు కూడా యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే కరికాలలో ఆమె రోల్ ఎలా ఉంటుంది, కథలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనే విషయాలను మూవీ టీమ్ ఇంకా వెల్లడించలేదు.
సినిమా విడుదలయ్యే సమయానికి ఆమె రోల్ పై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కరికాలను రెండు పార్ట్స్ గా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2027 జూలై 2న, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు సహా పలు భాషల్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మోడ్రన్ టెక్నాలజీ, హైక్వాలిటీ విజువల్స్, కొత్త తరహా కథనం మెయిన్ అట్రాక్షన్ గా ఉండనున్నాయి.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 15న ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. శంబాల తర్వాత యుగంధర్ ముని ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు, సందీప్ కిషన్ కు జోడీగా కేథరిన్ తో పాటు సాక్షి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
