Begin typing your search above and press return to search.

పన్నీర్ ఆర్డర్ చేస్తే చికెన్ వచ్చింది.. రెస్టారెంట్ తీరుపై నటి ఫైర్!

తన జీవితంలో నాన్ వెజ్ తినలేదని, అలాంటి తనతో ఇలా చికెన్ తినిపించేలా చేశారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదనను తెలియజేస్తూ ఒక పోస్ట్ షేర్ చేసింది సాక్షి అగర్వాల్.

By:  Madhu Reddy   |   23 Sept 2025 6:00 AM IST
పన్నీర్ ఆర్డర్ చేస్తే చికెన్ వచ్చింది.. రెస్టారెంట్ తీరుపై నటి ఫైర్!
X

సాధారణంగా రెస్టారెంట్ల విషయంపై ఎక్కువగా ఏవేవో వార్తలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా బిర్యానీలో బొద్దింకలు, బల్లులు రావడం ఇలా తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. అలాగే ఫుడ్ డెలివరీ విషయంలో కూడా చాలామంది గందరగోళం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం చాలా సందర్భాలలో మనం చూసే ఉన్నాము. అయితే ఇది సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ బాధలు తప్పడం లేదు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరోయిన్ కి కూడా ఒక ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. తన జీవితంలో ఎప్పుడూ కూడా నాన్ వెజ్ తినని హీరోయిన్ చేత కూడా చికెన్ తినిపించేలా చేశారంటూ ఆమె ఆవేదనను తెలియజేస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఆమె ఎవరో కాదు కోలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్.. తాజాగా పన్నీర్ బిర్యానీ తినాలని ఆన్ లైన్ వెబ్ సైట్ స్విగ్గీ లో ఆర్డర్ చేయగా.. ఒక రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగా తనకు పన్నీర్ బిర్యానీకి బదులు చికెన్ బిర్యానీ పంపించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా ఆకలిగా ఉండడంతో.. పన్నీర్ బిర్యానీ అనుకుని తినేసిందట. అయితే సగం తిన్నాక ఆమెకు అర్థమైంది ఏమిటంటే.. అది పన్నీరు బిర్యానీ కాదు చికెన్ బిర్యానీ అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటూ తెలియజేసింది. తన జీవితంలో నాన్ వెజ్ తినలేదని, అలాంటి తనతో ఇలా చికెన్ తినిపించేలా చేశారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదనను తెలియజేస్తూ ఒక పోస్ట్ షేర్ చేసింది సాక్షి అగర్వాల్. ఈ విషయం విన్న అభిమానులు అయ్యో ఎంత పని జరిగింది సాక్షి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సాక్షి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఎందుకంటే తమిళంలో నుంచి డబ్బింగ్ అయ్యే చిత్రాలు తెలుగులో విడుదల అవ్వడం చేత మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సాక్షి అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. కోలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి బాగానే క్రేజ్ సంపాదించింది. రాజా రాణి అనే సినిమా ద్వారా అతిథి పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సాఫ్ట్వేర్ గండ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత వరుసగా తమిళ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. నేరుగా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదని చెప్పవచ్చు.

గత కొన్ని రోజులుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. 2019లో యాక్షన్ అనే సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. అంతేకాదు బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న ఈమె 49వ రోజే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ ఏడాది మలయాళంలో బెస్ట్ అనే సినిమాతో రింగ్ రింగ్, ఫైర్, ది కేస్ డైరీ వంటి చిత్రాలలో నటించింది.