Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ చేసిన పనికి.. ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టిన సజ్జనార్

ఒక ఫేక్ ఫొటో.. ఒక్క సోషల్ మీడియా పోస్ట్.. ఏకంగా పోలీస్ కమిషనర్‌ ను రెస్పాండ్ అయ్యేలా చేసింది.

By:  M Prashanth   |   8 Oct 2026 3:41 PM IST
ఫ్యాన్స్ చేసిన పనికి.. ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టిన సజ్జనార్
X

ఒక ఫేక్ ఫొటో.. ఒక్క సోషల్ మీడియా పోస్ట్.. ఏకంగా పోలీస్ కమిషనర్‌ ను రెస్పాండ్ అయ్యేలా చేసింది. దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ కు సంబంధించిన మార్ఫింగ్ వీడియో విషయంలో అసలు అరెస్ట్ జరిగిందంటూ ఓ ఫొటో రీసెంట్ గా నెట్టింట వైరల్ అయింది. కానీ.. అది రియల్ ఫొటో కాదు. ఏఐతో తయారు చేసిన పిక్ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ద్వారా క్లారిటీ వచ్చింది.

చుట్టమల్లే సాంగ్ ను అసభ్యంగా ఎడిట్ చేశారనే ఆరోపణలతో ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ రీసెంట్ గా చక్కర్లు కొట్టింది. దానికి సీపీ సజ్జనార్ ఫొటోను కూడా యాజ్ చేశారు. దీంతో నిజంగానే పోలీసులు చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆ విషయం సజ్జనార్ దృష్టికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తాను ఉన్నట్టుగా కనిపించే ఆ ఫొటోను ఏఐ ద్వారా క్రియేట్ చేశారని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఫ్యాన్స్ తమ హీరోకు సంబంధించిన విషయాల్లో ఎంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతారో చూస్తూనే ఉంటాం. కానీ అదే స్పీడ్ ఇప్పుడు ఫేక్ కంటెంట్‌ కు కూడా స్త్రెంత్ ఇస్తోంది. నిజమా.. అబద్ధమా అని ఒక్కసారి కూడా చెక్ చేయకుండానే పోస్టులను షేర్ చేస్తే.. ఒక వ్యక్తి ఫొటో నుంచి పోలీసుల చర్యల వరకు ఏదైనా మినిట్స్ లో వైరల్ అయిపోతోంది.

ఆ వ్యవహారంలో సజ్జనార్ జూనియర్ ఎన్టీఆర్‌ ను ట్యాగ్ చేయడం మరోసారి చర్చగా మారింది. తన ఫొటోను కొందరు అభిమానులు ఇలా చేస్తున్నారని ఆయన ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఏఐ డీప్‌ ఫేక్‌ లకు చెక్ పడేలా అవగాహన కల్పించాలని కోరారు. అంటే ఇప్పుడు ప్రశ్న ఎన్టీఆర్ ఏం చేయాలన్నది కాదు.. ఫ్యాన్స్ ఏం చేయాలన్నదే. హీరోపై అభిమానం ఉండటం వేరు.. ఆ అభిమానం పేరుతో ఫేక్ కంటెంట్‌ ను తయారు చేయడం, వైరల్ చేయడం వేరు.

ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్ చేసి రియల్ విగా ప్రచారం చేస్తే దాని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఏఐ ఫొటోలు, వీడియోలు రియల్ గా కనిపించే రేంజ్ కు వచ్చాయి. అందుకే స్క్రీన్‌పై కనిపించింది కాబట్టి నిజమే అనుకోవడం డేంజర్ గా మారింది. ముఖ్యంగా హీరోల ఫ్యాన్ వార్స్‌ లో ఇలాంటి కంటెంట్ మరింత ఎక్కువ వైరల్ అయ్యే అవకాశం ఉంది.

అందుకే తారక్ ఫ్యాన్సే కాదు.. ప్రతి హీరో ఫ్యాన్ కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా పోస్ట్ కనిపిస్తే ముందుగా అది నిజమా కాదా అనేది చెక్ చేయాలి. లేదంటే హీరో కోసం చేసిన పోస్ట్.. చివరికి హీరోకే ఇబ్బందిగా మారే పరిస్థితి రావచ్చు. అభిమానం ఉండాలి.. కానీ దానికి లిమిట్స్ కూడా ఉండాలి. ముఖ్యంగా ఏఐ జెనరేషన్ లో ఆ లిమిట్ దాటితే.. ఫ్యాన్ చేసిన పని ఫ్యాన్‌ కే కాకుండా హీరోకు కూడా తలనొప్పిగా మారే అవకాశముంది.