బాలీవుడ్ సూపర్‌హిట్ కాంబోలో మరో సినిమా?
బాలీవుడ్ లో మంచి రొమాంటిక్ మ్యూజికల్ మూవీ వచ్చి చాలా కాలమవుతుంది అనుకుంటున్న టైమ్ లో వచ్చిన సైయారా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 2 Sept 2025 8:00 PM ISTబాలీవుడ్ లో మంచి రొమాంటిక్ మ్యూజికల్ మూవీ వచ్చి చాలా కాలమవుతుంది అనుకుంటున్న టైమ్ లో వచ్చిన సైయారా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. అసలే మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సైయారా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఓవర్‌నైట్ సెన్సేషన్స్ గా అనీత్, అహాన్
ఇంకా చెప్పాలంటే సైయారా ఈ రేంజ్ సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా అనుకోలేదు. ఈ సినిమా సక్సెస్ తో అహాన్ పాండే, అనీత్ పద్దా ఓవర్ నైట్ సెన్సేషన్స్ గా మారిపోయారు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో సైయారా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతుందంటే ఆ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ ను సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.
మోహిత్ ఇంట్లో కలిసిన సైయారా టీమ్
ఇదిలా ఉంటే సైయారా సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ త్రయం ఇప్పుడు మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా అనీత్ పద్దా, అహాన్ పాండే డైరెక్టర్ మోహిత్ సూరి ఇంట్లో కనిపించడంతో బాలీవుడ్ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. వీరందరూ కలిసి మరో ప్రాజెక్టు చేయనున్నారని మీడియా వర్గాల్లో తెగ వార్తలొస్తున్నాయి.
ముగ్గురి కలయికలో మరో ప్రాజెక్టు?
సైయారా సినిమా సూపర్ హిట్ అవడంతో పాటూ సైయారా సమయంలో వీరి ముగ్గురికీ బాగా సింక్ కుదిరిందని ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ మరో కొత్త ప్రాజెక్టు కోసం డిస్కషన్స్ జరుపుతున్నట్టు బాలీవుడ్ ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని అంటున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలే అయినప్పటికీ ప్రస్తుతమిది చర్చనీయాంశంగా మారింది.
