Begin typing your search above and press return to search.

మోస్ట్ అవైటెడ్ మూవీ.. ఓటీటీలోకి

ఈ రోజుల్లో స్టార్లు లేకుండా ఒక సినిమాకు థియేటర్లను ప్రేక్షకులను రప్పించడమంటే సవాలే.

By:  Garuda Media   |   11 Sept 2025 10:56 PM IST
మోస్ట్ అవైటెడ్ మూవీ.. ఓటీటీలోకి
X

ఈ రోజుల్లో స్టార్లు లేకుండా ఒక సినిమాకు థియేటర్లను ప్రేక్షకులను రప్పించడమంటే సవాలే. కానీ ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్ కలిసి నటించిన సినిమా కోసం ఆడియన్స్ ఉత్కంఠతో ఎదురు చూడడం.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం.. తొలి రోజు స్టార్ల సినిమాల రేంజిలో ఓపెనింగ్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. సైయారా అనే చిన్న సినిమా ఇలాంటి సంచలనమే రేపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ఆషిఖి-2, ఏక్ విలన్ ఫేమ్ మోహిత్ సూరి రూపొందించిన లవ్ స్టోరీ ఇది. అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే కొత్త హీరో హీరోయిన్లు నటించిన ఈ చిత్రం జులై 18న రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపింది. కొన్ని వారాల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయిన ఈ సినిమా.. ఉత్తరాదిన వందల సంఖ్యలో థియేటర్లలో 50 డేస్ రన్ పూర్తి చేసుకుంది. ఈ చిన్న సినిమా వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటడం విశేషం.

థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఓటీటీలో ఎప్పుడు రిలీజవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. హిందీలో 8 వీక్స్ ఓటీటీ విండో ఉంటుంది కదా. దాని ప్రకారమే ఈ చిత్రం డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లోకి సైయారా రాబోతోంది. ఆల్రెడీ థియేటర్లలో చూసిన వాళ్లు కూడా ఈ క్లాసిక్ లవ్ స్టోరీని ఆన్ లైన్లో చూస్తారనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో అంత విశేషం ఏముందో చూడాలని అన్ని భాషల వాళ్లూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి వ్యూయర్‌షిప్‌ గొప్పగానే ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘కూలీ’ విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రోజు నుంచి సరిగ్గా నాలుగు వారాలకే ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ స్ట్రీమ్ చేస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచే ‘కూలీ’ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. డిజిటల్ ప్రేక్షకుల నుంచి స్పందన ఏమంత గొప్పగా లేదు. దీంతో పాటే రిలీజైన ‘వార్-2’ మాత్రం రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది.