Begin typing your search above and press return to search.

స‌య్యారా హీరో కోసం టాప్ డైరెక్ట‌ర్స్ క్యూ

మోహిత్ సూరి దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంతోనే అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా నాయ‌కానాయిక‌లుగా ప‌రిచ‌య‌మ‌య్యారు.

By:  Sivaji Kontham   |   1 Oct 2025 9:02 AM IST
స‌య్యారా హీరో కోసం టాప్ డైరెక్ట‌ర్స్ క్యూ
X

భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథా చిత్రంగా చరిత్ర సృష్టించిన తర్వాత స‌య్యారా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ వీక్లీ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో నంబర్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విడుదలైన కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం 15 దేశాలలో (ఆస్ట్రేలియా & కెనడా సహా) టాప్ 10 చార్ట్‌లలోకి దూసుకెళ్లింది. వాటిలో తొమ్మిది దేశాలలో నం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

స‌య్యారా ఈ ప్రపంచాన్ని ఒక‌ ప్రేమ గీతంగా మారుస్తోంది. హిందీతో పాటు ఈ చిత్రం అరబిక్, బ్రెజిలియన్ పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇండోనేషియన్, మలయ్, స్పానిష్, థాయ్, జులు భాషలలో కూడా అందుబాటులో ఉంది.

మోహిత్ సూరి దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంతోనే అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా నాయ‌కానాయిక‌లుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇది మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరితో వీక్ష‌కుల‌ హృద‌యాల‌ను గెలుచుకుంది. ముఖ్యంగా అహాన్- అనీత్ జంట కెమిస్ట్రీ మంత్ర ముగ్ధుల‌ను చేసింది. ఇప్పుడు అహాన్ పాండే ప్ర‌తిభ‌ను మెచ్చి సంజ‌య్ లీలా భాన్సాలీ, అలీ అబ్బాస్ జాఫ‌ర్ లాంటి పెద్ద ద‌ర్శ‌కులు స్క్రిప్టులు రెడీ చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది.

స్వ‌త‌హాగానే ఒక కొత్త హీరో మొద‌టి ప్ర‌య‌త్న‌మే 500 కోట్ల క్ల‌బ్ సినిమాని అందించాడంటే అత‌డి త‌ద‌ప‌రి చిత్రం ఎలా ఉంటుందో చూడాల‌న్న కుతూహాలం అంద‌రిలోను ఉంటుంది. ఇప్పుడు దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌తో అహాన్ ఎలాంటి ప్ర‌యోగం చేయ‌బోతున్నాడో చూడాల‌నే ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. ఇక టైగ‌ర్ ఫ్రాంఛైజీ చిత్రాల‌తో విసిగిపోయిన అలీ అబ్బాస్ జాఫ‌ర్.. జెన్ జెడ్ హీరో అహాన్ పాండే కోసం ఒక ల‌వ్ కం యాక్ష‌న్ సినిమాని రూపొందించాల‌ని ప్ర‌య‌త్నించ‌బోతున్నాడు. దీనికోసం అంత‌గా అంచ‌నాలు ఉండ‌ని కొత్త కుర్రాడు అయితే బావుంటుంద‌ని భావించారు ఆదిత్యా చోప్రా. అందుకే ఇప్పుడు అహాన్ తో అలీ అబ్బాస్ జాఫ‌ర్ సినిమాని నిర్మించేందుకు ఆదిత్య చోప్రా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నార‌ని తెలిసింది.

`స‌య్యారా`లో భావోద్వేగ నాటకీయ సన్నివేశాలతో అహాన్ పాండే ను, అత‌డి ఆరాను చూసి అలీ అబ్బాస్ ఆశ్చర్యపోయాడని తెలుస్తోంది. ఒక యువ నటుడితో సినిమా చేస్తే ప్రేక్షకులకు ఆశ్చర్యం కలుగుతుందని అలీ అబ్బాస్ కి ఆదిత్య చోప్రా స‌ల‌హా ఇవ్వ‌గానే అత‌డు వెంట‌నే ఓకే చెప్పాడ‌ట‌. క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భాన్సాలీ, టైగ‌ర్ ఫేం అలీ అబ్బాస్ జాఫ‌ర్ ఇద్ద‌రిలో ఎవ‌రితో అహాన్ ముందుగా ప్రారంభిస్తాడో చూడాలి.