'సయ్యారా' కొరియన్ సినిమాకు కాపీనా?
నిజానికి కొరియన్ సినిమాకు కాపీ వెర్షన్ అంటూ సయ్యారాపై విమర్శలొచ్చాయి.
By: Sivaji Kontham | 9 Aug 2025 1:25 AM ISTఅహాన్ పాండే- నమిత్ పద్దా జంటగా నటించిన `సయ్యారా` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు పైగా వసూలు చేసింది. అయితే సినిమా థియేటర్లలోకి వచ్చినప్పటి నుండి విమర్శలకు గురైంది. కొరియన్ చిత్రం `ఎ మూమెంట్ టు రిమెంబర్` తో పోలికలు చెబుతూ నెటిజనులు విమర్శిస్తున్నారు.
నిజానికి కొరియన్ సినిమాకు కాపీ వెర్షన్ అంటూ సయ్యారాపై విమర్శలొచ్చాయి. ఈ వివాదంపై రచయిత సంకల్ప్ సదానా సమాధానమిచ్చారు. ఈ సినిమా గతంలో వచ్చిన ఏ సినిమా, ఏ రచనకు కాపీ కాదు. కొరియన్ సినిమాతో పోలుస్తూ, మా సినిమా చూడండి.. చూసిన తర్వాతే చెప్పండి! అంటూ అతడు వ్యాఖ్యానించాడు. ప్రేరణ పొందామా కాపీయేనా? ఒరిజినలా? అనేది మీరే నిర్ణయించండి అని రాసారు.
సయ్యారా కథను ఒక ఉద్విగ్న క్షణాన స్క్రిప్టు పనులు చేసామని తెలిపారు. కథ లేదు, పాత్రలు లేవు - కేవలం ఒక వాక్యం మమ్మల్ని తాకింది. ఒక హిట్ పాట మీ బుర్రలో ఉండిపోతే చాలు... అనుకుని ప్రారంభించినట్టు తెలిపారు. సయ్యారా అల్జీమర్స్ వ్యాధితో బాధపడే అమ్మాయి ప్రేమలో పడేవాడిగా అహాన్ పాండే అద్భుతంగా నటించాడు.
