'సయ్యారా'ను ఆపలేక పోయిన 'స్పిరిట్' హీరోయిన్!
బాలీవుడ్‌తో పాటు దేశం మొత్తం గత రెండు వారాలుగా సయ్యారా సినిమా గురించిన చర్చ జరుగుతోంది.
By: Ramesh Palla | 2 Aug 2025 9:00 PM ISTబాలీవుడ్‌తో పాటు దేశం మొత్తం గత రెండు వారాలుగా సయ్యారా సినిమా గురించిన చర్చ జరుగుతోంది. అంతా కొత్త వారితో కేవలం పాతిక నుంచి ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సయ్యారా సినిమా బాక్సాఫీస్ జోరు మామూలుగా లేదు. దేశంలోనే కాకుండా యూఎస్‌లోనూ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసింది. చాలా తక్కువ సమయంలోనే ఛావా రికార్డ్‌ను బ్రేక్ చేసింది. యూఎస్‌లో ఈ సినిమా రూ.100 కోట్లకు చేరువగా ఉంది. లాంగ్ రన్ లో రూ.150 కోట్లు వసూళ్లు చేసినా ఆశ్చర్యం లేదు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సయ్యారా సినిమా దాదాపుగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి లెక్కలు మరింత షాకింగ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
సిద్దాంత్ చతుర్వేదికి జోడీగా త్రిప్తి డిమ్రి
సయ్యారా సినిమా జోరును తగ్గించడం ఏ సినిమాల వల్ల కావడం లేదు. ఇటీవల 'దఢక్ 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన దఢక్ సినిమా ప్రాంచైజీలో రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. కానీ ఆ దఢక్ కి ఈ సినిమాకు సంబంధం లేకపోవడంతో ప్రేక్షకులు కొందరు షాక్ అయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా 2018లో తమిళనాట వచ్చిన పరియేరుమ్ పెరుమాళ్ సినిమాకు అఫిషియల్ రీమేక్. అధికారికంగా ప్రకటించనప్పటికీ చిన్న చిన్న మార్పులతో రీమేక్‌ను చేశారు.
సయ్యారా ముందు నిలువలేక పోయిన దఢక్ 2
సినిమాలోని మెయిన్ స్టోరీ లైన్‌ను తీసుకుని చేసిన మార్పుల వల్ల సోల్ మిస్ అయింది. తమిళ్‌లో సాగిన ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో కనిపించలేదు. హీరోయిన్‌గా నటించిన త్రిప్తి డిమ్రి ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. లా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ డ్రామాను ఆకట్టుకునే విధంగా మల్చడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. భాష మారడంతో పాటు భావోద్వేగంకు సంబంధించిన ఎలిమెంట్స్ మార్చాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ సరిగ్గా పండించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అందుకే ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. సయ్యారా సినిమా ముందు తేలిపోయింది. సయ్యారా లేకుంటే కొంతలో కొంత అయినా వసూళ్లు దక్కేవి అనేది బాక్సాఫీస్ వర్గాల వారి అంచనా.
స్పిరిట్‌లో ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రి
దఢక్ 2 సినిమా విడుదలకు ముందు సయ్యారా వసూళ్లకు బ్రేక్ వేసే సినిమా అంటూ ప్రచారం జరిగింది. తీరా చూస్తూ అదే సయ్యారా వల్ల దఢక్ 2 చెత్తికిల్ల పడింది. మరీ దారుణంగా ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. యానిమల్ సినిమా తర్వాత త్రిప్తి డిమ్రి చాలా సినిమాలు చేసింది. కానీ అన్నింటికి ఇదే తరహా ఫలితం చవిచూడాల్సి వస్తుంది. ఇటీవలే ప్రభాస్‌కి జోడీగా స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. దీపికా పదుకునేను తొలగించి మరీ త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఎంపిక చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. రణబీర్ కపూర్‌కి సెట్ అయిన త్రిప్తి స్పిరిట్‌లో ప్రభాస్‌కి సూట్ అయ్యేనా, స్పిరిట్ సినిమాతో త్రిప్తికి హిట్ పడేనా అనేది చూడాలి.
