బాక్సాఫీస్: రూ.300 కోట్లు కొట్టిన కొత్త జంట!
ప్రేమకథలకు ఉన్న ఏమోషన్, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఆల్బమ్, న్యూ ఫేస్ లతో కూడిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
By: M Prashanth | 4 Aug 2025 11:38 AM ISTబాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ఎప్పటికప్పుడు తగినంత బాక్సాఫీస్ బూస్ట్ లభిస్తోంది. ఈ మధ్యకాలంలో స్టార్స్ నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ఓ కొత్త జంట తో వచ్చిన లవ్ స్టొరీ మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రీసెంట్ విడుదలైన ‘సైయారా’ సినిమా దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్, ఆకర్షణీయమైన సంగీతం, ఫీల్ గుడ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా అహాన్ పాండే, కథానాయికగా అనీత్ పడ్డా నటించగా, ఇద్దరూ కొత్తవారే కావడం బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఆసక్తి రేపింది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి విడుదలైన నాటి నుంచి మంచి వసూళ్లు రావడమే కాకుండా, ఓ కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది.
ట్రెండ్ సెట్ చేసిన ప్రేమకథ
ప్రేమకథలకు ఉన్న ఏమోషన్, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఆల్బమ్, న్యూ ఫేస్ లతో కూడిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోల నుంచే మంచి రెస్పాన్స్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. ముఖ్యంగా, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో సినిమాకు హై క్వాలిటీ టెక్నికల్ స్టాండర్డ్ రావడంతో ప్రేక్షకులకు మరో స్థాయి అనుభూతిని అందించింది. సినిమా ప్రమోషన్స్, రొమాంటిక్ ఎమోషన్స్, ఆకట్టుకునే నటన అన్నీ కలిసి మూవీ సక్సెస్‌కు బలమైన కారణాలయ్యాయి.
17వ రోజే రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ
ఇప్పటికే నాలుగు రోజులకే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘సైయారా’, రిలీజైన 17వ రోజే దేశవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్కును అధిగమించింది. మూడో ఆదివారం కూడా సినిమా దేశవ్యాప్తంగా రూ.9 కోట్లు వసూలు చేసింది. దీంతో, మొత్తం కలెక్షన్ రూ.300.25 కోట్ల నెట్ కు (భారతదేశంలోని గ్రాస్ కాకుండా నెట్ వసూళ్లు) చేరడం బాలీవుడ్‌లో రేర్ ఫీట్. గతంలో పీకే, దంగల్, సుల్తాన్, టైగర్ జిందా హై, సంజు, అనిమల్, పఠాన్, జవాన్, గదర్ 2, స్త్రీ 2, ఛావా వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ ఈ క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సైయారా’ కూడా అదే ప్రెస్టీజియస్ క్లబ్‌లో స్థానం సంపాదించుకుంది.
ఒక్క రాత్రిలో స్టార్‌గా మారిన అహాన్, అనీత్
ఈ సినిమాతో హీరో అహాన్ పాండే, హీరోయిన్ అనీత్ పడ్డా ఇద్దరూ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌లు అయ్యారు. మోహిత్ సూరి డైరెక్షన్‌లో, కొత్త టాలెంట్‌తో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు మార్గం చూపింది. ఫ్రెష్ ఫేసెస్‌తో కూడా భారీ బిజినెస్ సాధించొచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘సైయారా’ విజయం చూసి ఫిల్మ్ మేకర్స్ మరిన్ని కొత్త జంటలతో ప్రయోగాలకు రెడీ అవుతున్నారు.
యశ్ రాజ్ ఫిలింస్ మార్క్.. బిజినెస్ పరంగా స్పెషల్
సినిమాకు ముందుగానే మ్యూజిక్ రైట్స్ ద్వారా భారీ రికవరీ రావడం, రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లడం బాలీవుడ్ ట్రేడ్ లో హాట్ టాపిక్. ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూషన్‌లోనూ యశ్ రాజ్ ఫిలింస్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా భారీ లాభాల్లో కొనసాగుతోందన్న టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. పెద్ద హీరోలు లేకుండా, కంటెంట్‌కు, కొత్త ముఖాలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటం ఇండస్ట్రీకి సరికొత్త మార్గాన్ని చూపిస్తోంది. ఇప్పటికే ‘సైయారా’ బాక్సాఫీస్ దూకుడుతో కొత్త రికార్డులు సెట్ చేస్తోంది. వచ్చే రోజుల్లో మరిన్ని కొత్త వారితో ఫ్రెష్ స్టోరీలతో సినిమాలు వస్తే ప్రేక్షకులు ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సినిమా నిరూపించింది.
