Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ సునామీ: డెబ్యూ జంటతో 300 కోట్లా..

మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం హీరో అహాన్ పాండే, హీరోయిన్ అనీత్ పడ్డా వంటి ఫ్రెష్ ఫేసెస్‌తో తెరకెక్కింది.

By:  M Prashanth   |   30 July 2025 1:08 AM IST
బాక్సాఫీస్ సునామీ: డెబ్యూ జంటతో 300 కోట్లా..
X

బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘సైయారా’ సినిమా పేరు ఓ రేంజ్‌లో మారుమోగిపోతోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం హీరో అహాన్ పాండే, హీరోయిన్ అనీత్ పడ్డా వంటి ఫ్రెష్ ఫేసెస్‌తో తెరకెక్కింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఎమోషన్స్, ఫీల్-గుడ్ మ్యూజిక్, నేచురల్ పెర్ఫార్మెన్స్‌లతో ‘సైయారా’ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

కొత్త ట్రెండ్‌కు నాంది

‘సైయారా’ విజయంతో బాలీవుడ్‌లో కొత్త ముఖాలకు రూట్లు తెరుచుకున్నట్లైంది. ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగలవని మరోసారి రుజువైంది. ఈ సినిమాలో అనీత్ పడ్డా నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో అహాన్ పాండే సైలెంట్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. సినిమా విజయం చూస్తే, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కథానాయికలు, కథానాయుకులకు అవకాశాలు అందుతాయని ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది.

సైయారా సక్సెస్ వెనక ప్రత్యేకతలు

ఈ మూవీ ప్రీమియం మ్యూజిక్, హార్ట్ టచింగ్ కథ, ఎమోషనల్ స్క్రీన్‌ప్లే అన్నీ కలిసి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. యశ్ రాజ్ ఫిలింస్ మ్యూజిక్ రైట్స్ డీల్‌తో ప్రొడక్షన్ ఖర్చును ముందే రికవర్ చేసుకోవడం బిజినెస్ పరంగా విశేషం. ఇక, సినిమా అంచనాలను దాటి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు సైతం ఈ మూవీ ట్రెండ్ మారుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

సినిమా బాక్సాఫీస్ హవా

ఇప్పటికే నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘సైయారా’, ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు రూ. 260 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవారే అయినా ఈ స్థాయి బ్లాక్‌బస్టర్ అందుకోవడం సినీ ఇండస్ట్రీలోనే అరుదైన సంఘటన. గతంలో కొత్త జంటలతో లవ్ స్టోరీలు పెద్దగా వర్క్ అవ్వవని భావించారు. కానీ ఈ సినిమా విజయంతో ట్రెండ్ మారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయా పెయిర్ మీద వచ్చిన ఆదరణ చూసి ఫిల్మ్ మేకర్స్ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంపై ఆసక్తిగా ఉన్నారు.

మ్యూజిక్‌తోనే రూ.50 కోట్ల రికవరీ

ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను రూ. 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్‌కు భారీ క్రేజ్ రావడంతో, మ్యూజిక్ రైట్స్ ద్వారా పూర్తిగా పెట్టిన బడ్జెట్ రికవర్ చేసుకున్నారని సమాచారం. అంటే బాక్సాఫీస్‌లో వచ్చే ప్రతి రూపాయి స్టూడియోకి నికర లాభమే. ఇది బాలీవుడ్‌లో అరుదైన విజయాల్లో ఒకటి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మొత్తంగా సినిమాకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి.

‘సైయారా’ పెట్టిన నూతన రికార్డులు కొత్త ట్రెండ్‌కు బాటలు వేస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే దిశగా బాలీవుడ్ ఒక్క అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. సైయారా మాదిరి ప్రేమకథలు, కొత్త జంటలతో ప్రయోగాలు చేయడంలో ఇక వెనకడుగు ఉండదని నిపుణులు భావిస్తున్నారు.