Begin typing your search above and press return to search.

'సైయారా' బికినీ సీన్.. ఇది అసలు మ్యాటర్!

చిన్న మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సైయారా మూవీ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   5 Aug 2025 3:46 PM IST
సైయారా బికినీ సీన్.. ఇది అసలు మ్యాటర్!
X

చిన్న మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సైయారా మూవీ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. డెబ్యూ యాక్టర్స్ అహన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఆ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పిస్తోంది. ఇప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సక్సెస్ ఫుల్ గా మూడో వారం థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది.

వివిధ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నా.. సైయారాకు ఆడియన్స్ లో క్రేజ్ తగ్గడం లేదు. 15 రోజుల్లో దాదాపు రూ.284 కోట్లను రాబట్టి అదరగొట్టింది. ఇప్పుడు మరిన్ని వసూళ్లను సాధిస్తోంది. కేవలం రెండో వారంలో 107.75 కోట్లను రాబట్టిన సైయారా.. బీ టౌన్ లో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా నిలిచింది.

మొదటి వారంతో పోల్చుకుంటే.. రెండో వారంలో కలెక్షన్లు కాస్త తగ్గినప్పటికీ.. మూడో వారం కూడా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అదే సమయంలో మూవీ టీమ్ పోస్ట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. డైరెక్టర్ మోహిత్ సూరి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ కూడా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అయితే సైయారాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ గా మారారని చెప్పాలి. సినిమాలో సూపర్ సాంగ్స్ లేనప్పటికీ.. ఆయన ఎమోషన్స్ ను సరిగ్గా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. బాడీ లాంగ్వేజ్ తోపాటు ఎక్స్ప్రెషన్స్ విషయంలో తన డైరెక్షన్ తో మెప్పించారు. ఇప్పుడు సినిమా విజయం తనకు షాకింగ్ గా అనిపించిందని విజయ్ తెలిపారు.

దర్శకుడు మోహిత్ సూరితో సహా బృందం ఈ చిత్రం గురించి నమ్మకంగా ఉన్నప్పటికీ, దాని విజయం స్థాయి తనకు ఆశ్చర్యకరంగా ఉందని విజయ్ వెల్లడించారు. అహాన్, అనీత్ ఇద్దరూ తన మార్గదర్శకత్వంలో తీవ్రమైన వర్క్‌ షాప్‌ లకు హాజరయ్యారని తెలిపారు. సినిమాలో ఏదీ చౌకైన థ్రిల్‌ కోసం చేయలేదని ఆయన చెప్పారు.

అనీత్ బికినీ సీన్ విషయంలో కూడా అదే చేశామని తెలిపారు. ఆ సన్నివేశం చాలా నేచురల్ గా ఉందని, మరీ బోల్డ్ గా లేదని అన్నారు. మోహిత్ సూరి తన డైరెక్షన్ తో అందరినీ ఫిదా చేశారని మెప్పించారు. ముఖ్యంగా అహాన్ తన టాలెంట్ తో మెప్పించారని కొనియాడారు. బాగా కష్టపడ్డారని తెలిపారు. సైయారా కేవలం ఒక రొమాంటిక్ మూవీ మాత్రమే కాదని, ఎమోషనల్ జర్నీ అంటూ చెప్పుకొచ్చారు.