Begin typing your search above and press return to search.

సైనా నెహ్వాల్ (X) ప‌రిణీతి: ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేయ‌డానికి కార‌ణం?

క్రీడాకారుల బ‌యోపిక్ లు ఎప్పుడూ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా నిలుస్తున్నాయి. ఎంఎస్ ధోని- ది అన్ టోల్డ్ స్టోరి, మేరికోమ్ స‌హా ఎన్నో చిత్రాలు విజ‌య‌వంతం అయ్యాయి.

By:  Sivaji Kontham   |   31 Jan 2026 8:00 AM IST
సైనా నెహ్వాల్ (X) ప‌రిణీతి: ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేయ‌డానికి కార‌ణం?
X

క్రీడాకారుల బ‌యోపిక్ లు ఎప్పుడూ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా నిలుస్తున్నాయి. ఎంఎస్ ధోని- ది అన్ టోల్డ్ స్టోరి, మేరికోమ్ స‌హా ఎన్నో చిత్రాలు విజ‌య‌వంతం అయ్యాయి. ఇదే కేట‌గిరీలో బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా జీవితంపైనా సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడే గుర్తు చేసుకోవ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది.

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ `సైనా`లో నటించిన పరిణీతి చోప్రా తనను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంపై మ‌రోసారి చ‌ర్చ వేడెక్కించింది. నిజానికి దీనిపై సైనా చాలా పరిణతితో స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సైనా ఈ విషయంపై మాట్లాడుతూ నిజాల‌ను వెల్ల‌డించారు. ఇటీవ‌ల పాపుల‌ర్ యూట్యూబ్ చానెల్ తో మాట్లాడుతూ వెల్ల‌డించిన ఈ విష‌యాలు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చాయి.

ఇంట‌ర్వ్యూలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ... ``నిజానికి నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గమనించలేదు, దానిపై అస్సలు దృష్టి పెట్టలేదు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో బిజీగా ఉండటం వల్ల ఇలాంటి విషయాలు పట్టించుకోలేదు..`` అని తెలిపారు.

మేమిద్దరం ఎప్పుడూ మంచి ఫ్రెండ్స్ అయిపోలేదు. ఆ సినిమా కోసం జరిగిన సెషన్లలో కేవలం ఒక ప్రొఫెషనల్‌గా నా లైఫ్ జర్నీ గురించి ఆమెకు వివరించాను. అంతకుమించి మా మధ్య స్నేహం ఉందని నేను ఎప్పుడూ అనలేదు. సినిమా షూటింగ్ సమయంలో మేమేమీ లంచ్‌లు లేదా డిన్నర్లకు వెళ్లలేదు. రెండు మూడు వారాలకోసారి గంట లేదా రెండు గంటలు కలిసేవాళ్లం.. అప్పుడు కూడా డైరెక్టర్ మా మధ్య ఉండేవారు. మేం కలిసి అంత సమయం గడపలేదు.. కాబట్టి ఫాలో లేదా అన్‌ఫాలో గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అని వివ‌రించారు.

నిజానికి పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్‌ను అన్‌ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అయితే సైనా తన సమాధానంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఇటు సైనా గానీ, అటు పరిణీతి గానీ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడం లేదు. ఇది పూర్తిగా వారి వృత్తిపరమైన సంబంధమని, వ్యక్తిగతంగా మనస్పర్థలేవీ లేవని అర్థమవుతోంది.

సైనా చిత్రం విడుద‌లై ఇప్ప‌టికే నాలుగేళ్ల‌యింది. అయినా ఇప్ప‌టికీ ప‌రిణీతి- సైనా స్నేహం గురించి నెటిజ‌నుల‌కు బాగానే గుర్తుంది. ఆ ఇద్ద‌రూ కేవ‌లం ప్రొఫెష‌న‌ల్ గా మాత్ర‌మే క‌లుసుకున్నారు త‌ప్ప‌, ఎప్పుడూ స్నేహితులుగా లేరు.