'హిట్-4' కోసం విదేశాలకా?
క్రైమ్ థ్రిల్లర్ల సంచనలం శైలేష్ కొలను గురించి పరిచయం అవసరం లేదు. `హిట్` ప్రాంచైజీతో మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయాడు.
By: Srikanth Kontham | 22 Sept 2025 9:14 AM ISTక్రైమ్ థ్రిల్లర్ల సంచనలం శైలేష్ కొలను గురించి పరిచయం అవసరం లేదు. `హిట్` ప్రాంచైజీతో మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. ఇప్పటికే `హిట్` నుంచి రిలీజ్ అయిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం `హిట్ 4` స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో హీరో ఎవరు? అన్నది హిట్ 2 క్లైమాక్స్ లోనే రివీల్ చేసారు. ఈసారి కోలీవుడ్ స్టార్ కార్తీ రంగంలోకి దిగుతున్నాడు. రెండు భాగాలను మించి మూడవ భాగంలో క్రైమ్ పీక్స్ లో ఉంటుందని చెప్పాల్సిన పనిలేదు. రెండవ భాగంలో నాని పాత్రను నెక్స్ట్ లెవల్లో చూపించాడు.
విదేశీ క్రైమ్ నేపథ్యం:
ఈ నేపథ్యంలో నాల్గవ భాగంలో అదే రోల్ అంతకు మించి ఉండాలి. ప్రస్తుతం శైలేష్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. క్రైమ్ ని కొత్త రకంగా చూపించే కోణంలో రకరకాలగా విశ్లేషిస్తున్నారు. దీనిలో భాగంగా క్రైమ్ నేపథ్యంలో ఉన్న ఎన్నో పుస్తకాలను రిఫరెన్స్ లుగా తీసుకుంటున్నాడు. భారత్ లో క్రైమ్ ఎలాంటి రూపం దాల్చింది? కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పదేళ్ల క్రితం జరిగిన కొన్ని క్రైమ్స్ గురించి అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన మీడియా కథనాలు ఆధారంగా కొంత సమాచారం సేకరిస్తున్నారుట. ఆయా ప్రదేశాల్ని లైవ్ లో చూడాలని ప్లాన్ చేస్తున్నాడుట.
రెండు నెలలు విదేశాల్లోనే:
దీనిలో భాగంగా మరో నెల రోజుల్లో ఆసిస్, కెనడా వెళ్లబోతున్నాడని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. అవసరం మేర అక్కడ క్రైమ్ అధికారుల అనుమతితో మరికొంత సమాచారాన్ని సేకరించాలనే ఆలోచనలో ఉన్నాడుట శైలేష్. రెండు నెలల పాటు అక్కడే ఉండేలా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాడుట. దీన్ని బట్టి కథ సిద్దమవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం కార్తీ కూడా తమిళ సినిమాలో బిజీగా ఉన్నాడు. `వా వాతయార్` లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగతా పనులు ముగించి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వతే:
'సర్దార్' కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న 'సర్దార్ 2' కూడా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `మార్షల్` అనే మరో చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. వీటితో పాటు `ఖైదీ 2` కూడా పట్టాలెక్కించాలని సిద్దమవుతున్నారు. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత `హిట్ 4`కి కార్తీ డేట్లు కేటాయించే అవకాశం ఉంది.
