'దేవర' స్టార్ తలతిక్క నిర్ణయమా?
ఒకప్పుడు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరో హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఏం చేయాలో పాలు పోక వచ్చిన అవకాశాలను చేస్తూ కెరియర్లో ముందుకు సాగుతున్నారు.
By: Ramesh Palla | 5 Dec 2025 1:01 PM ISTబాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం సక్సెస్ దక్కించుకోవడానికి కింద మీద పడుతున్నారు. ఒకప్పుడు వందల కోట్ల రూపాయల వసూళ్లను చూసిన హీరోలు ఇప్పుడు మినిమం తమ సినిమాలకు ఖర్చు చేసిన పదుల కోట్ల బడ్జెట్ని వెనక్కి తీసుకురావడానికి కింద మీద పడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోలు, సెకండ్ గ్రేడ్ హీరోలు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోవాలి తప్ప ఆ సినిమానే చేస్తా... ఈ పాత్రను మాత్రమే చేస్తా అంటే కెరియర్ కతం అవుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం బాలీవుడ్లో నటీనటులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరో హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఏం చేయాలో పాలు పోక వచ్చిన అవకాశాలను చేస్తూ కెరియర్లో ముందుకు సాగుతున్నారు. గతంలో మాదిరిగా మంచి సినిమాలు మంచి పాత్రలు కావాలి అని కోరుకుంటున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకు బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కారణం అంటూ స్వయంగా సీనియర్ బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో వరుస సినిమాలు...
ఇలాంటి సమయంలో ఫామ్ కోల్పోయి సతమతం అవుతున్న సీనియర్ నటుడు, దేవర స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆశ్చర్యకరంగా ఒక సినిమాను షూటింగ్ ముందు వదులుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని నెలల క్రితం ఆ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యి, కొంతమేరకు షూటింగ్ కూడా జరిగిందని హిందీ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇలాంటి సమయంలో ఆ సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్ తప్పించుకున్నాడు, తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. స్నేహ తౌరాణి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ పాల్గొనాల్సి ఉండగా ఆయన స్థానంలో సన్నీ కౌశల్ దిగడంతో యూనిట్ సభ్యులు సైతం మొదట షాక్ అయ్యారు. సైఫ్ అలీఖాన్ ఈ పాత్రకి తాను సెట్ కాను అని భావించడం వల్లే తప్పుకున్నాడని, దీనిలో పెద్దగా తప్పు వెతకాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు కానీ బాలీవుడ్ వర్గాలకు చెందిన వారు మాత్రం సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా అవకాశాలను వదులుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు.
స్నేహ తౌరాణి దర్శకత్వంలో...
స్నేహ తౌరాణి ప్రముఖ నిర్మాత రమేష్ తౌరాణి కూతురు అనే విషయం తెలిసిందే . ఆమె 2000 సంవత్సరంలో దర్శకురాలిగా సినిమాను చేసింది, ఆ సినిమా ఆశించిన మేరకు కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ దర్శకురాలిగా ప్రతిభ ఉన్నది అనిపించింది. ఆ సమయంలో స్నేహ భాంగ్రా పా లే సినిమాతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ సినిమాలో సన్నీ కౌశల్, రుక్సార్ థిల్లాన్ నటించారు. దర్శకురాలిగా పరిచయం కాకముందు నుండే స్నేహ కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలకు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. సినిమాలకు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కి ఈమె వర్క్ చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యూజిక్ వీడియోలు ఈమె రూపొందించింది. ఇలా తనకు మ్యూజిక్ డాన్స్ పట్ల ఉన్న అభిరుచిని కనబరుస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. స్నేహ కాస్త గ్యాప్ తీసుకొని తన దర్శకత్వంలో రెండో సినిమాను మొదలు పెట్టింది. సైఫ్ అలీ ఖాన్ తో అనుకున్న ఈ సినిమా కాస్త ఆయన తప్పుకోవడంతో మరోసారి తన మొదటి సినిమా హీరో సన్నీ కౌశల్ తో చేసేందుకు రెడీ అయ్యింది. సైఫ్ అలీ ఖాన్ తప్పుకున్న ఈ సినిమా ఆపేది లేదని ఆమె సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చినట్లు సమాచారం.
సైఫ్ అలీ ఖాన్ హీరోగా...
ఈ సినిమా ను సైఫ్ అలీ ఖాన్ వదిలేయడం వల్ల కెరీర్ కి పెద్ద డ్యామేజ్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కెరియర్లో అత్యంత కీలకమైన రేస్, బూత్ పోలీస్ వంటి సినిమాలను రమేష్ తౌరాణి నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలకు సీక్వెల్స్ చేయాలని రమేష్ తౌరాణి చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టించాడు. కానీ తన కూతురు సినిమా నుండి సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చేయడంతో ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సైఫ్ కెరియర్ సoదగ్ధంలో ఉన్న సమయంలో రమేష్ తౌరాణి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తన కూతురు సినిమా నుండి సైఫ్ అలీ ఖాన్ హఠాత్తుగా బయటకు వెళ్లిపోవడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదే నిజమైతే ముందు ముందు సైఫ్ అలీఖాన్ తో తీయాలి అనుకున్న సీక్వెల్స్ ప్రయత్నాలను ఆయన ఆపివేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే సైఫ్ కెరీర్ కి పెద్ద దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే చాలామంది స్నేహ తౌరాణి సినిమా నుండి సైఫ్ అలీ ఖాన్ తప్పుకోవడం అనేది పెద్ద తలతిక్క నిర్ణయం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆయన మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
