సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?
కుటుంబంతో కలిసి గ్రీస్ వెకేషన్కు వెళ్లిన సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏజియన్ సముద్ర తీరంలో యాట్ ప్రయాణాలు, స్విమ్మింగ్, ఫిషింగ్తో సరదాగా గడిపారు. కరీనాతో ఫోటోకు “ఎవరో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు” అంటూ సైఫ్ ఇచ్చిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో కరీనాకు ప్రేమను వ్యక్తం చేసిన ప్రదేశం కావడంతో ఈ ట్రిప్ ప్రత్యేకంగా నిలిచింది.
By: Madhu Reddy | 17 Nov 2026 11:03 PM ISTసాధారణంగా సెలబ్రిటీలు కాస్త సినిమా షూటింగ్ ల నుండి విరామం దొరికిందంటే చాలు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే అక్కడ ఎంజాయ్ చేసిన మధుర జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూడా తన ఫ్యామిలీతో కలిసి గ్రీస్ దేశానికి విహారయాత్రకు వెళ్ళాడు. అక్కడ నుండి పంచుకున్న ఫోటోలు , ఇచ్చిన క్రేజీ క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సైఫ్ అలీ ఖాన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన భార్య కరీనా కపూర్, పిల్లలు తైమూర్, జెహ్ తో కలసి గ్రీస్ దేశానికి విహారయాత్రకి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అందులో ఏజియన్ సముద్ర తీరంలో కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలు, యాట్ ప్రయాణాలు, ప్రశాంతంగా పుస్తకాలు చదువుతూ తీసుకున్న ఫోటోలను పంచుకున్నారు. ఇక ఈ ట్రిప్ లో వారు స్వచ్ఛమైన సముద్ర తీరాలలో ఈత కొడుతూ.. చేపలు పడుతూ.. ట్రెజర్ హంట్ ఆటలు ఆడుతూ.. సాయంత్రం వేళ యాట్ పై విశ్రాంతి తీసుకుంటూ గడిపినట్లు అభిమానులతో పంచుకున్నారు.
ఇక్కడ అందర్నీ ఆకర్షించిన విషయం ఏమిటంటే సైఫ్ అలీ ఖాన్.. హోమర్ రచించిన ది ఒడిస్సీ, గ్రీక్ పురాణాలకు సంబంధించిన పుస్తకాలను తీసుకెళ్లగా.. కరీనాకపూర్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్లను చదువుతూ కనిపించారు. పైగా కరీనాతో ఉన్న ఒక ఫోటోకి సైఫ్ అలీ ఖాన్ .."ఎవరో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు" అంటూ ఇచ్చిన క్రేజీ క్యాప్షన్ కి అభిమానులు , సెలబ్రిటీలు కూడా సరదాగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా తన దివంగత తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ చిన్నప్పుడు నిద్రపోవడానికి ముందు తనకు గ్రీకు పురాణ కథలు చదివి వినిపించేవారని సైఫ్ గుర్తు చేసుకున్నారు.మొత్తానికైతే గ్రీస్ పర్యటనకు సంబంధించిన ఈ ఫోటోలు, ఆయన పంచుకున్న క్రేజీ క్యాప్షన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే సైఫ్ అలీఖాన్ , కరీనా దంపతులకు గ్రీసుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో వీరిద్దరూ ఇక్కడ ట్రిప్ కి వచ్చినప్పుడు మొదటిసారి కరీనాకు తన ప్రేమను వ్యక్తపరిచారు కూడా.. అలా ఇప్పుడు తమ పిల్లలతో కలిసి ఇదే ప్రదేశంలో ట్రిప్ ఎంజాయ్ చేస్తుండడంతో ఈ ట్రిప్పు మరింత ప్రత్యేకత చాటుకుంది.
