అదంతా దుష్ప్రచారమే! సినీ సెలబ్రిటీలలో అత్యంత కూలెస్ట్ కపుల్ వీళ్లే!!
తాజాగా కరీనా బర్త్ డే సందర్భంగా పోస్ట్ ని ఉద్ధేశించి ఆనందం వ్యక్తం చేసిన ఒక అభిమాని కూలెస్ట్ కపుల్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
By: Sivaji Kontham | 16 Aug 2026 2:37 PM ISTబెబో కరీనాకపూర్- సైఫ్ అలీఖాన్ జంట ఆదర్శ దాంపత్యం గురించి అభిమానులలో చాలా చర్చ సాగుతుంది. తాజాగా కరీనా బర్త్ డే సందర్భంగా పోస్ట్ ని ఉద్ధేశించి ఆనందం వ్యక్తం చేసిన ఒక అభిమాని కూలెస్ట్ కపుల్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీని అర్థం ఆ ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలు ఉండవు అనే కదా!
ఇంతకుముందు సైఫ్ అలీఖాన్ వెన్నులో కత్తి పోట్ల ఘటన సమయంలో మీడియా ఈ జంటకు వ్యతిరేకంగా చాలా కథనాలు అల్లింది. ఈ వెన్నుపోటుకు కారణం కరీనా అంటూ కొన్ని మీడియాలు కథలు అల్లాయి. వారి మధ్య చిచ్చు పెట్టే ప్రచారమే సాగింది ఆ క్లిష్ఠ సమయంలో. అయితే తామిద్దరం కూల్ కూల్ అంటూ ఎంజాయ్ చేసే ఒకరికోసం ఒకరు! అనేంతగా కలిసిమెలిసి ఉండే జంట అని నిరూపిస్తున్నారు.. మరింత లోతుగా విషయంలోకి వెళితే..
బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ (సైఫీనా) జోడీ పరిచయం అవసరం లేదు. ఇటీవల సైఫ్ పుట్టినరోజు సందర్భంగా కరీనా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక క్యూట్ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఒక అభిమాని వీరిద్దరినీ చూసి ''సినీ పరిశ్రమలోనే అత్యంత కూలెస్ట్ కపుల్`` అని వ్యాఖ్యానించాడు. ఎలాంటి విభేదాలు, గొడవలు లేకుండా ఎంతో ప్రశాంతంగా- ఆనందంగా జీవించే దాంపత్యానికి వీరు నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు.
గతంలో సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన ఒక దాడి (వెన్నులో కత్తిపోట్ల సంఘటన) సమయంలో కొన్ని మీడియా సంస్థలు ఈ జంటపై అనేక ఊహాగానాలు, ప్రతికూల కథనాలు ప్రచారం చేశాయి. ఆ ఘటనకు కరీనానే కారణమంటూ వచ్చిన కథనాలపై ఈ జంట ఎంతో తీవ్రంగా స్పందించడమే కాకుండా... ఎంతో పరిణతితో వ్యవహరించింది. తమ మధ్య చిచ్చు పెట్టేలా సాగిన ఆ దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ... ఒకరికొకరు తోడుగా నిలిచారు. క్లిష్ట సమయాల్లో సర్దుకుపోయే తత్వంతో ముందుకెళ్తూ తమ బంధం ఎంత బలమైనదో నిరూపించారు.
సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజును పురస్కరించుకుని కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సైఫ్‌ను `మై ఫరెవర్ రైడ్ ఆర్ డై` (జీవితాంతం తోడుండే నా నేస్తం) అని సంబోధిస్తూ కరీనా తన ప్రేమను చాటుకుంది. అంతేకాకుండా.. తాను పోస్ట్ చేసిన ఫోటోలన్నీ సైఫ్ స్వయంగా ఆమోదించినవేనని జాలీగా క్యాప్షన్ జోడించింది. ఒకరి అభిరుచులను ఒకరు గౌరవించుకుంటూ.. సరదాగా సాగిపోయే వీరి దాంపత్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
కరీనా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి బాలీవుడ్ ప్రముఖుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. సైఫ్ సోదరి సబా పటౌడీతో పాటు మలైకా అరోరా, రిద్ధిమా కపూర్ సాహ్ని, రియా కపూర్, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, సంజయ్ కపూర్, సోఫీ చౌదరి, రుజుతా దివేకర్ వంటి పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు కామెంట్లలో సైఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కామెంట్ సెక్షన్ అంతా ఈ జంటపై ప్రేమ, ప్రశంసలతో నిండిపోయింది.
కరీనా-సైఫ్‌ల పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు `కూలెస్ట్ కపుల్` అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే ఇదే సమయంలో ఈ పోస్ట్ సాధించిన క్రేజ్‌ను వాడుకునేందుకు కొన్ని స్పామ్- బోట్ అకౌంట్లు రంగంలోకి దిగాయి. సెలబ్రిటీల కామెంట్ల కింద తమ AI వీడియోలను ప్రమోట్ చేసుకుంటూ వరుసగా కామెంట్లు పెట్టడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఏది ఏమైనా సైఫీనా క్రేజ్ ముందు ఇవన్నీ చిన్నబోయాయని చెప్పవచ్చు.
