Begin typing your search above and press return to search.

బుగ్గ మీద 10 ముద్దులిస్తే 1000 చెల్లించేద‌న్న హీరో

అవును.. ఇది నిజ‌మే బుగ్గ‌పై ఒక్కో ముద్దుకు 1000 రూపాయ‌లు ఆఫ‌ర్ చేసింది స‌ద‌రు మ‌హిళా నిర్మాత‌.

By:  Sivaji Kontham   |   27 Sept 2025 4:57 PM IST
బుగ్గ మీద 10 ముద్దులిస్తే 1000 చెల్లించేద‌న్న హీరో
X

అవును.. ఇది నిజ‌మే బుగ్గ‌పై ఒక్కో ముద్దుకు 1000 రూపాయ‌లు ఆఫ‌ర్ చేసింది స‌ద‌రు మ‌హిళా నిర్మాత‌. ఈ ఆఫ‌ర్ అందుకున్న హీరో ఎవ‌రో కాదు.. హిందీ హీరో సైఫ్ అలీఖాన్. అది ఇష్టం ఉన్నా లేక‌పోయినా కానీ, అత‌డు ముద్దులిచ్చి రూ. 1000 తీసుకోవాల్సి వ‌చ్చేది. అప్ప‌టికి త‌న ఆర్థిక‌ ప‌రిస్థితి అలాంటిది. అత‌డికి వేల కోట్ల విలువ చేసే సంస్థానం ఉన్నా కానీ, ఒక డెబ్యూ హీరోగా అతడు ఆర్థికంగా నిల‌దొక్కుకునేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పాడు.

90ల‌లో కెరీర్ ప్రారంభించిన సైఫ్ ఆరంభం సైడ్ హీరో పాత్ర‌ల్లో నటించాడు. స‌హాయక పాత్ర‌లు అత‌డిని వ‌రించాయి. కానీ డ‌బ్బు సంపాదించాలంటే కొన్ని అస‌హ్య‌క‌ర‌మైన అవకాశాలు అందుకోవాల్సి వ‌చ్చేది! అని సైఫ్ హింట్ ఇచ్చాడు. ఒక మ‌హిళా నిర్మాత బుగ్గ‌పై ప‌ది ముద్దులిస్తే 1000 చొప్పున ఆఫ‌ర్ చేసింద‌ని గుర్తు చేసుకున్నాడు.

అది సుల‌భం.. కానీ క‌ట్టుబాట్ల‌తో పెరిగాను. మా కుటుంబంలో అలాంటి వాటికి అనుమ‌తి లేదు. స్వీయ స్పృహ‌, ఆత్మాభిమానం ఉన్న కుటుంబ వాతావ‌ర‌ణంలో పెరిగాను. ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోను కాకూడ‌ద‌ని కుటుంబంలో జాగ్ర‌త్త‌గా పెంచారు.. అని తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్ మొదట 21 వయసులో వివాహం చేసుకున్నాడు. 25 వయస్సులో తండ్రి అయ్యాడు. చిన్న వ‌య‌సులో బాధ్య‌త‌లు.. తన కుటుంబాన్ని నమ్మకమైన పని చేసి పోషించాల్సిన అవసరం ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో సైఫ్‌కి డబ్బు ఇచ్చిన ప్రతిసారీ పదిసార్లు ఆమె బుగ్గను ముద్దు పెట్టుకోవాలని డిమాండ్ చేసింది. లేడీ నిర్మాత వారానికి రూ.1000 చొప్పున చెల్లించేది అని తెలిపాడు.

90ల‌లో న‌టుడిగా ఆరంగేట్రం చేసిన‌ త‌ర్వాత ఎంపిక‌ల ప‌రంగా కొన్ని త‌ప్పులు చేసాన‌ని సైఫ్ అంగీక‌రించాడు. కాలక్రమేణా దిల్ చాహ్తా హై , ఓంకార వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తన స్థిర‌మైన‌ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతడు ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. సేక్రెడ్ గేమ్స్‌తో OTT లో అడుగుపెట్టిన మొద‌టి పెద్ద హీర్ సైఫ్. ఇటీవ‌ల సౌత్ లో విల‌న్ పాత్ర‌ల‌ను పోషించాడు.