Begin typing your search above and press return to search.

సైఫ్ కేసులో కీలక మలుపు.. నిందితుడి డెసిషన్‌తో ప్రాసిక్యూషన్‌పై ఫోకస్!

తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ గిల్టీ ప్లీ చేయడానికి రెడీగా ఉన్నట్లు నిందితుడు కోర్టుకు తెలియజేయడంతో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 Aug 2026 4:00 AM IST
సైఫ్ కేసులో కీలక మలుపు.. నిందితుడి డెసిషన్‌తో ప్రాసిక్యూషన్‌పై ఫోకస్!
X

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి కేసు మరో కీలక దశకు చేరుకుంది. బాంద్రాలోని ఆయన ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ జాతీయుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాజాగా కోర్టు ముందు తీసుకున్న డెసిష‌న్ ఇప్పుడు కేసులో ఆసక్తికర పరిణామంగా మారింది. తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ గిల్టీ ప్లీ చేయడానికి రెడీగా ఉన్నట్లు నిందితుడు కోర్టుకు తెలియజేయడంతో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

అయితే నిందితుడు తప్పును అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటే కేసు అక్క‌డితో ఆగిపోయింద‌ని అర్థం కాదు. అతని అభ్యర్థనపై ప్రాసిక్యూషన్ వైఖరి ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. నిందితుడి పిటిషన్‌ను అంగీకరించాలా? దానిపై అభ్యంతరం వ్యక్తం చేయాలా? లేక కేసు ఇప్పటికే నమోదైన అభియోగాల ప్రకారం రెగ్యుల‌ర్ లీగ‌ల్ ప్రాసెస్‌లోనే ముందుకు వెళ్లాలా? అనే అంశాలపై ప్రాసిక్యూషన్ రియాక్ష‌న్ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదే సమయంలో నిందితుడు గిల్టీ ప్లీకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వెనుక అసలు వ్యూహం ఏమిటన్న చర్చ కూడా మొదలైంది. విచారణను ఎదుర్కొనే బదులు నేరాన్ని అంగీకరించడం ద్వారా శిక్ష విషయంలో కోర్టు నుంచి కొంత ఉపశమనం పొందాలనే ఉద్దేశం ఉండొచ్చన్న కోణం ఆసక్తిని పెంచుతోంది. అయితే గిల్టీ అని చెప్పడం మాత్రమే శిక్షను త‌గ్గించ‌ద‌ని, నేర స్వభావం, కేసులోని అంశాలు, కోర్టు పరిగణనలోకి తీసుకునే ఇతర పరిస్థితుల ఆధారంగానే తదుపరి తీర్పు ఉండనుంది.

ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇటీవలే అతనిపై తీవ్రమైన అభియోగాలను కోర్టు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే గిల్టీ ప్లీకి సంబంధించిన తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ తన రియాక్ష‌న్ ను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఆ సమాధానం ఆధారంగా తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి డెసిష‌న్ ను తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో తదుపరి వాయిదా కీలకంగా మారనుంది.