Begin typing your search above and press return to search.

రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోన్న బాలీవుడ్ స్టార్ హీరో

సైఫ్ తండ్రి మ‌న్సూర్ అలీ ఖాన్ ప‌టౌడి ఇండియాకు చెందిన స్టార్ క్రికెటర్. 2011లో మ‌న్సూర్ అలీ ఖాన్ చ‌నిపోయిన త‌ర్వాత 10వ ప‌టౌడీ న‌వాబ్ బిరుదును తన వార‌స‌త్వంగా సైఫ్ పొందారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Aug 2025 5:00 PM IST
రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోన్న బాలీవుడ్ స్టార్ హీరో
X

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇవాల్టితో 55 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 55 ఏళ్ల వ‌య‌సులో కూడా ఆయ‌న ఎంతో తెలివిగా వ్య‌వ‌హరిస్తూ, చాలా సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో న‌టుడిగా కొన‌సాగుతున్న సైఫ్ కు చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఓ వైపు త‌న వార‌స‌త్వాన్ని మ‌రియు మ‌రోవైపు తాను క‌ష్ట‌ప‌డిన సంపాదించుకున్న స‌క్సెస్ ను చాలా జాగ్ర‌త్త‌గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సైఫ్.

రాయ‌ల్ ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి..

సైఫ్ తండ్రి మ‌న్సూర్ అలీ ఖాన్ ప‌టౌడి ఇండియాకు చెందిన స్టార్ క్రికెటర్. 2011లో మ‌న్సూర్ అలీ ఖాన్ చ‌నిపోయిన త‌ర్వాత 10వ ప‌టౌడీ న‌వాబ్ బిరుదును తన వార‌స‌త్వంగా సైఫ్ పొందారు. సైఫ్ తండ్రి మాత్ర‌మే కాదు, త‌ల్లి కూడా చాలా ఫేమ‌స్. సైఫ్ త‌ల్లి ష‌ర్మిలా ఠాగూర్ బాలీవుడ్ లో మంచి న‌టి. త‌ల్లిదండ్రుల ద్వారా సైఫ్ కు ముందునుంచే మంచి లైఫ్ ఉంది. అయితే ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ సైఫ్ మాత్రం కేవ‌లం రాజ వార‌సుడిగా మాత్ర‌మే కాకుండా త‌నదైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల కోసం అత‌ను ఎంచుకునే క‌థ‌లు, వాటిలో అత‌ను పోషించే పాత్ర‌లు, అన్నీ సైఫ్ ను న‌టుడిగా త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్లాయి.

ఆర్థికంగా కూడా ముందంజ‌

ఆర్థికంగా కూడా సైఫ్ త‌న‌ను తాను చాలా స్థిర‌ప‌రచుకున్నారు. ఒక్కో సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్లు వ‌ర‌కు తీసుకునోనే సైఫ్, ఎండార్స్‌మెంట్స్ కు మాత్రం రూ.1 నుంచి రూ. 5 కోట్లు ఛార్జ్ చేస్తారు. తాజా రిపోర్ట్స్ ప్ర‌కారం సైఫ్ కు రూ.1,200 కోట్ల ఆస్తి ఉంద‌ని అంచ‌నా. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో పాటూ త‌న ప‌ర్స‌న‌ల్ ఇన్వెస్ట్‌మెంట్స్ మ‌రియు పూర్వీకుల‌ నుంచి వ‌చ్చిన ఆస్తి కూడా సైఫ్ కు ఉంది. దాంతో పాటూ అత‌ను ఓ రెండు ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌కు కో ఓన‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే సైఫ్ ఆస్తి మొత్తంలో అత్యంత విలువైన‌ది అత‌నికి హ‌ర్యానాలో ఉన్న ప‌టౌడీ ప్యాలెస్. కేవ‌లం ఆ ప్యాలెస్ విలువే రూ.800 కోట్లు ఉంటుందట‌. సైఫ్ తో పాటూ అత‌ని భార్య, బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ కూడా రూ.485 కోట్ల ఆస్తితో అత‌ని ఫ్యామిలీ సంప‌ద‌ను గ‌ణ‌నీయంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికొస్తే రీసెంట్ గా జ్యువెల్ థీఫ్ అనే థ్రిల్ల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సైఫ్, త్వ‌ర‌లోనే ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అక్ష‌య్ కుమార్ తో క‌లిసి హైవాన్ సినిమాలో స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు. 55 ఏళ్ల వ‌య‌సులో కూడా సైఫ్ బాలీవుడ్ లోనే ఎక్కువ ప్రాఫిట‌బుల్ సెల‌బ్రిటీల్లో ఒక‌రిగా చోటును సంపాదించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.