Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పొట్టి ఫ్రాకులో గుబులు గుబులుగా ఆ చూపులేంటి?

సోగ కళ్లతో సూటిగా చూస్తూ.. చిట్టి పొట్టి ఫ్రాకులో సెగలు పుట్టిస్తూ.. ఉత్తరాది సోయగం సయీ మంజ్రేకర్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు.

By:  Sivaji Kontham   |   10 May 2026 10:01 AM IST
ఫోటో స్టోరి: పొట్టి ఫ్రాకులో గుబులు గుబులుగా ఆ చూపులేంటి?
X

సోగ కళ్లతో సూటిగా చూస్తూ.. చిట్టి పొట్టి ఫ్రాకులో సెగలు పుట్టిస్తూ.. ఉత్తరాది సోయగం సయీ మంజ్రేకర్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ట్రెడిష‌న‌ల్ గాళ్ లా క‌నిపిస్తూనే హీట్ పెంచ‌డంలో ఈ బ్యూటీ త‌ర్వాతేన‌ని ప్రూవ్ అవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ భామ‌ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. థై అందాలతో మైమరిపిస్తూ.. గుబులు రేపే చూపులతో కుర్రకారు మతులు చెడగొడుతోంది. అటు ట్రెడిషనల్ లుక్ లో పద్ధతిగా కనిపిస్తూనే.. ఇటు గ్లామర్ షోలోనూ తగ్గేదేలే అన్నట్లుగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది. ప్రణవ్ ఫోటోగ్రఫీలో వచ్చిన ఈ ఫోటోలు చూస్తుంటే సయీ తన అందంతో కొత్త గ్లామర్ గోల్స్ సెట్ చేస్తోందనిపిస్తోంది.




సయీ మంజ్రేకర్ సినీ ప్రయాణం 2012లో `కాక్‌స్పర్శ్స‌` అనే మరాఠీ చిత్రంతో ప్రారంభమైంది. అయితే ఈ భామ‌కు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 2019లో వచ్చిన `దబాంగ్ 3` చిత్రంలో ఖుషీ చౌతాలా పాత్రలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా సయీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫలితంగా ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి (డెబ్యూ) విభాగంలో నామినేషన్‌ను కూడా దక్కించుకుని తన సత్తా చాటుకుంది.




టాలీవుడ్ విషయానికి వస్తే.. 2022లో వరుణ్ తేజ్ సరసన `గని` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన `స్కంద` చిత్రంలోనూ నటించింది. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో సయీకి తెలుగులో ఒక సాలిడ్ హిట్ అవసరమైంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవాల‌ని నేర్చుకుంది.




సయీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఏకైక తెలుగు చిత్రం `మేజర్`. అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ బయోపిక్‌లో ఇషా అగర్వాల్‌గా సయీ అద్భుతమైన నటనను కనబరిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచి త‌న‌ కెరీర్‌కు గట్టి పునాది వేసింది. ఈ చిత్రంతో తెలుగు, హిందీ భాషల్లో మంచి క్రేజ్ లభించింది. తన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయడంలో స‌యీ ఎల్ల‌పుడూ సఫలమైంది.

సయీ మంజ్రేకర్ సింగర్ గురు రంధావా సరసన `కుచ్ ఖట్టా హో జాయ్` అనే చిత్రంలోను న‌టించింది. అటు గ్లామర్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే.. ఇటు విభిన్నమైన ప్రాజెక్టులతో తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం అందం మాత్రమే కాదు.. అభినయం కూడా ఉన్న నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భవిష్యత్తులో ఈ ఉత్తరాది భామ మరిన్ని తెలుగు చిత్రాల్లో మెరిసే అవకాశం ఉంది. అయితే త‌న కెరీర్ బెస్ట్ ఇంకా అందుకోవాల్సి ఉంది. టాలీవుడ్ లేదా బాలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న వ‌రుస చిత్రాల‌లో మెర‌వ‌డ‌మే గాక స‌రైన బ్ల‌క్ బ‌స్ట‌ర్లు అందుకుంటే స‌యీ కెరీర్ నెక్ట్స్ లెవ‌ల్ కి చేరుకుంటుంది. అప్ప‌టివ‌ర‌కూ కాస్త ఓపిగ్గా వేచి చూడ‌ల్సిందే.