పిక్‌టాక్ : బీచ్‌లో క్యూట్ మంజ్రేకర్ అందాల షో
బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది స్టార్ కిడ్స్‌లో సాయి మంజ్రేకర్ ఒకరు. ఈమె బాలీవుడ్ స్టార్స్ మహేష్ మంజ్రేకర్, మేధాలకు 2001లో జన్మించింది.
By: Ramesh Palla | 14 Sept 2025 2:00 AM ISTబాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది స్టార్ కిడ్స్‌లో సాయి మంజ్రేకర్ ఒకరు. ఈమె బాలీవుడ్ స్టార్స్ మహేష్ మంజ్రేకర్, మేధాలకు 2001లో జన్మించింది. సాయి మంజ్రేకర్ 2012లో కాక్స్‌పర్ష్ అనే మరాఠీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 11 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్‌ను ప్రారంభించిన సాయి మంజ్రేకర్‌కి ఎక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల బాల నటిగా ఎక్కువ సినిమాలు చేయలేదు. కాక్స్‌పర్ష్ సినిమా తర్వాత ఏడు ఏళ్ల గ్యాప్ తర్వాత 2019లో దబాంగ్ 3 సినిమాలో నటించింది. ఆ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయలేదు. దాంతో సాయి మంజ్రేకర్‌కి బాలీవుడ్‌లో గుర్తింపు రాలేదు. ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి పిలుపు దక్కింది. 2022లో హీరోయిన్‌గా తన మొదటి సినిమాను సాయి మంజ్రేకర్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
వరుణ్ తేజ్ గని మూవీలో హీరోయిన్‌గా..
హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగు మెగా హీరో వరుణ్ తేజ్ కి జోడీగా గని సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయింది. గని సినిమా హిట్ కాకున్నా లక్కీగా అదే ఏడాది మేజర్ సినిమాలో సాయి మంజ్రేకర్ నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు, ఈమెకు హిందీలోనూ మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. దాంతో అక్కడ నుంచి ఆఫర్లు రావడం మొదలు అయ్యాయి. తెలుగులో 2023లో స్కంద సినిమాతోనూ సాయి మంజ్రేకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. దాంతో టాలీవుడ్‌లో ఈమెను పట్టించుకునే వారు కరువు అయ్యారు. ఈ ఏడాదిలో కళ్యాణ్ రామ్‌తో నటించిన సన్నాఫ్ వైజయంతి సినిమా కూడా దారుణంగా విఫలం అయింది.
వరుస ఫ్లాప్స్‌తో సాయి మంజ్రేకర్...
టాలీవుడ్‌లో చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో హీరోయిన్‌గా ఆమెకు ఆఫర్లు రావడం గగనం అయింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌లోనూ ఈమె సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. కానీ ఆ సినిమాలు సైతం ఈమెకు హిట్‌ను ఇవ్వలేదు. గత ఏడాది హిందీలో రెండు సినిమాలు, ఈ ఏడాది తెలుగులో ఒక సినిమా విడుదల అయ్యాయి. కానీ అవేవి ఈమెను జనాల్లో నిలుపలేక పోయాయి. అయితే ఈమె సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా షేర్ చేసే ఫోటోలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అందంతో పాటు మంచి ఫిజిక్, మంచి ఫోటో జెనిక్ ఫేస్ కావడంతో సాయి మంజ్రేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ ఫోటోలు షేర్ చేసినా తెగ వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మరో ఫోటో షూట్ తో సాయి మంజ్రేకర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బీచ్‌లో అందాల ఆరబోత చేస్తూ సాయి మంజ్రేకర్
తాజాగా సాయి మంజ్రేకర్ బీచ్‌కు వెళ్లిన సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బీచ్‌లో అందాల ముద్దుగుమ్మ అంటూ ఈ ఫోటోలను నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న సాయి మంజ్రేకర్‌కి లక్ కలిసి రాకపోవడంతో ఆఫర్లు రావడం లేదని, ఈమె కనుక క్లిక్ అయితే బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసంను ఆమె ఫాలోవర్స్ వ్యక్తం చేస్తున్నారు. మరికొంత కాలంకు అయినా ఖచ్చితంగా సాయి మంజ్రేకర్ బాలీవుడ్‌లో ఒక మంచి హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్ ఇకపై అయినా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని అంతా అంటున్నారు. ఇదే సమయంలో ఆమె బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయాలని సన్నిహితులు సూచిస్తున్నారు. మరి ఆమె నిర్ణయం ఏంటి అనేది చూడాలి.
