Begin typing your search above and press return to search.

ఆమె ఉంటే బొమ్మ హిట్టే.. 'హైందవ'పై సాయి శ్రీనివాస్ కాన్ఫిడెన్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న మూవీ 'హైందవ'.

By:  M Prashanth   |   14 Oct 2026 8:21 PM IST
ఆమె ఉంటే బొమ్మ హిట్టే.. హైందవపై సాయి శ్రీనివాస్ కాన్ఫిడెన్స్
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న మూవీ 'హైందవ'. నూతన దర్శకుడు లూధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. అలాగే ప్రెస్ మీట్ లో హీరో సాయి శ్రీనివాస్, డైరెక్టర్ లూధీర్ బైరెడ్డి పలు ఆసక్తికర విషయాలు రివిల్ చేశారు. అలాగే మీడియా అడిగిన ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ఈ కార్యక్రమంలో దర్శకుడు లూధీర్ బైరెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఫస్ట్ టైమ్ దశావతారాల కాన్సెప్ట్ తో ఒక పూర్తి స్థాయి సినిమా చేసే అవకాశం రావడం తన అదృష్టమని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా బదులిస్తూ.. ఇంతటి సెన్సిటివ్ అండ్ భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ ను చాలా బాధ్యతగా తీసుకున్నానని, ఏ వర్గం ఆడియన్స్ కు ఇబ్బంది కలగకుండా అద్భుతమైన ఎమోషన్ తో ఈ కథను సిద్ధం చేశానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.

ఇక హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా కథా నేపథ్యాన్ని, స్క్రిప్ట్ జర్నీని బయటపెట్టారు. ఇదొక అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ అని, ఇంతకుముందు ఆడియన్స్ ఎప్పుడూ చూడని విధంగా ఒక కొత్త ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో ఉంటుందని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ కథను ముందుగా ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్నారని, ఆ కంటెంట్ ను ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్ లోకి మార్చడానికే ఏకంగా ఏడాదిన్నర సమయం పట్టిందని ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కష్టాన్ని వివరించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి సాయి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సంయుక్త ఏ కథ ఓకే చేసినా అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయినట్లేనని, ఆమె సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఈ సినిమాకు కూడా బాగా ప్లస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణ సంస్థ గురించి చెబుతూ.. తమ నిర్మాత మహేష్ మరెవరో కాదని, దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ గారి అల్లుడే అని సగర్వంగా చెప్పారు. ఆయన సపోర్ట్ వల్లే అవుట్ పుట్ ఇంత బాగా వస్తోందని కొనియాడారు.

తన వ్యక్తిగత సినీ ప్రయాణం గురించి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు వి.వి. వినాయక్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'ఆది' సినిమా సమయం నుంచే తాను సెట్స్ లోనే తిరుగుతూ పెరిగానని ఆయన గుర్తుచేసుకున్నారు. తనకు మొదటినుంచీ సినిమా తప్ప వేరే ప్రపంచమేమీ తెలియదని, ఆ ప్యాషన్ తోనే కెరీర్ లో ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నానని తన డెడికేషన్ గురించి మీడియాకు చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

ఇదే వేదికపై తన మరో ప్రాజెక్ట్ 'టైసన్ నాయుడు' గురించి కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయిందని స్పష్టం చేశారు. ఇక బ్యాలెన్స్ వర్క్, రిలీజ్ లాంటి అప్డేట్స్ అన్నీ ప్రొడ్యూసర్ల చేతిలోనే ఉన్నాయని, ఆ వివరాలు నేరుగా వాళ్లనే అడగాలని బదులిచ్చారు.