లెజెండ్‌తో 'బేబీ' డైరెక్టర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?
కలర్ ఫొటో, బేబీ వంటి విభిన్నమైన సినిమాలతో రైటర్‌గా, బేబీ సినిమాతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం అభిరుచి గల రైటర్‌గా, డైరెక్టర్‌గా ప్రశంలసతో పాటు అవార్డుల్ని సైతం దక్కించుకన్నాడు.
By: Ravindar Gorantla | 5 April 2026 1:01 PM ISTకలర్ ఫొటో, బేబీ వంటి విభిన్నమైన సినిమాలతో రైటర్‌గా, బేబీ సినిమాతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం అభిరుచి గల రైటర్‌గా, డైరెక్టర్‌గా ప్రశంలసతో పాటు అవార్డుల్ని సైతం దక్కించుకన్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న `చెన్నై లవ్‌స్టోరీ` మూవీకి రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరంకు జోడీగా శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన మెలోడీ సాంగ్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్‌పై సందిగ్దత నెలకొన్ని విషయం తెలిసిందే. `పెద్ది` రిలీజ్ కారణంగా తమ సినిమా రిలీజ్ వాయిదాపడే అవకాశం ఉందని ఈ మూవీకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్‌కెఎన్ చెప్పడంతో ఈ మూవీ రిలీజ్‌పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైటర్, నిర్మాత సాయి రాజేష్ నీలం ఇన్ స్టా వేదికగా అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించి సర్‌ప్రైజ్ చేశాడు. ఇదే సందర్భంగా కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్‌కెఎన్‌తో కలిసి తాను నిర్మిస్తున్న `చెన్నై లవ్‌స్టోరీ` రిలీజ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ విషయంలో అస్పష్టత నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్‌పై స్పష్టతనిచ్చారు. ఈ మూవీని జూన్‌లో రిలీజ్ చేస్తున్నామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజాతో కలిసి పని చేసే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించారు. ఆల్ రెడీ ఆయనతో టచ్లో ఉన్నామని, వచ్చే ఏడాది అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడండని సమాధానం ఇచ్చారు.
అంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో `బేబీ` డైరెక్టర్ సాయి రాజేష్ నీలం ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతోందని, అయితే ఆ మ్యూజికల్ లవ్‌స్టోరీ ఎవరితో ఉంటుంది? హీరో, హీరోయిన్స్ ఎవరు?..ఎప్పుడు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటికి రానుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడిగా, రైటర్‌గా అభిరుచిగల చిత్రాలని అందిస్తున్న సాయి రాజేష్ నీలం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో అసోసియేట్ కాబోతున్నాడంటే భారీగానే ప్లాన్ చేసి ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం `చెన్నై లవ్‌స్టోరీ` పనుల్లో బిజీగా ఉన్న సాయి రాజేష్ నీలం దీనితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ పనుల్లోనూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారట. అదే `బేబీ`. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన `బేబీ` మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో సాయి రాజేష్ ఉన్నారని ఇన్ సైడ్ టాక్.
