ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!
ఇక గ్లామర్ పరంగా అయితే అసలు మధ్యలో మీరదు. కానీ ఆమెకు అప్పుడప్పుడు నెగిటివ్ టాక్ వస్తుందంటే అది సినిమాల వల్ల కాదు.. ఇంటర్వ్యూలలో ఆమె మాట్లాడే కొన్ని మాటల వల్లే.
By: Priya Chowdhary Nuthalapti | 3 Nov 2026 5:00 PM ISTసాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనతో.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్‌కు గ్లామర్‌తో సంబంధం లేకుండానే మంచి గుర్తింపు వచ్చింది. కథలు ఎంచుకునే తీరులో కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారని పేరు ఉంది. అందుకే సాయి పల్లవి సినిమాల విషయంలో ఎప్పుడూ పెద్దగా విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు లేవు.
ఇక గ్లామర్ పరంగా అయితే అసలు మధ్యలో మీరదు. కానీ ఆమెకు అప్పుడప్పుడు నెగిటివ్ టాక్ వస్తుందంటే అది సినిమాల వల్ల కాదు.. ఇంటర్వ్యూలలో ఆమె మాట్లాడే కొన్ని మాటల వల్లే. తన మనసులో ఉన్న విషయాలను స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని సాయి పల్లవి కూడా గుర్తించినట్లు కనిపిస్తోంది.
గతంలో విరాటపర్వం సినిమా ప్రమోషన్ల సమయంలో కశ్మీరీ పండిట్ల అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ తర్వాత భారత సైన్యంపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా రామాయణ ప్రమోషన్ల సమయంలో రావణుడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి కారణమయ్యాయి. సాయి పల్లవి చెప్పాలనుకున్న విషయం ఒకటైతే, కొందరు దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనలో మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యం ఏమిటి అని ఒక యాంకర్ అడగక వెంటనే సాయి పల్లవి చెబుతూ తన భావాలను స్పష్టంగా వ్యక్తపరచడంలో ఇబ్బంది ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తన మాటలు కొన్నిసార్లు వేరే అర్థాలు తీసుకుంటున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఇకపై తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుని, మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
సాయి పల్లవి నటనపై కానీ, ఆమె ఎంచుకునే సినిమాలపై కానీ పెద్దగా విమర్శలు ఉండవు. ఆమెకు వచ్చిన పేరు, అభిమానుల ప్రేమ అంతా ఆమె ప్రతిభతోనే సంపాదించుకున్నది. అలాంటి హీరోయిన్‌కు మాటల వల్ల వివాదాలు రావడం నిజంగా అనవసరమే. ఇప్పుడు ఆమె ఈ ఒక్క విషయాన్ని సరిదిద్దుకుంటే ఇక కెరీర్లో పెద్దగా లోటు ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ సినిమాలో సీత పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
