Begin typing your search above and press return to search.

సరైన డైరెక్టర్ చేతిలో పడ్డ సాయిపల్లవి

ప్రస్తుతం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో బెస్ట్ యాక్టర్ల లిస్టు తీస్తే.. అందులో సాయిపల్లవి పేరు ముందు వరసలో ఉంటుంది.

By:  Garuda Media   |   14 Sept 2025 10:00 PM IST
సరైన డైరెక్టర్ చేతిలో పడ్డ సాయిపల్లవి
X

ప్రస్తుతం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో బెస్ట్ యాక్టర్ల లిస్టు తీస్తే.. అందులో సాయిపల్లవి పేరు ముందు వరసలో ఉంటుంది. గ్లామర్ విషయంలో చాలామంది హీరోయిన్లతో పోలిస్తే సాయిపల్లవి వెనుకబడి ఉంటుంది. కేవలం పెర్ఫామెన్స్‌తోనే ఆమె భారీగా అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. ఏ పాత్ర చేసినా.. తన మార్కు నటనతో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందామె.

గత ఏడాది ‘అమరన్’ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే.. అందులో సాయిపల్లవి నటన ఓ ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు. పెర్ఫామెన్స్ విషయంలో సాయిపల్లవి నుంచి వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అని చెప్పొచ్చు. ప్రస్తుతం ‘రామాయణం’ లాంటి మెగా మూవీలో సీత పాత్ర చేస్తుండడంతో తన నటన మరో స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఒక గొప్ప దర్శకుడితో సినిమా కమిటవ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అతనే.. వెట్రిమారన్.

‘పొల్లాదవన్’తో మొదలుపెడితే వెట్రిమారన్ ప్రతి సినిమా ఒక క్లాసిక్. ఆయన చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలు కూడా చాలా బలంగా, పెర్ఫామెన్స్‌కు మంచి స్కోప్ ఇచ్చేలా సాగుతాయి. చివరగా ‘విడుదల-2’ చిత్రంతో పలకరించిన వెట్రిమారన్.. తమిళ స్టార్ హీరో శింబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ధనుష్‌తో తాను తీసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వడ చెన్నై’ తరహా కథతోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇందులో సాయిపల్లవిని కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం.

వెట్రిమారన్‌తో సాయిపల్లవి ఇంతకుముందే పని చేసింది. నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ‘పావ కథైంగల్’లో ఒక ఎపిసోడ్‌లో ఆమె లీడ్ రోల్ చేయగా.. వెట్రిమారన్ డైరెక్ట్ చేశాడు. ఆ ఆంథాలజీ ఫిలింలో ఈ ఎపిసోడే హైలైట్‌గా నిలిచింది. సాయిపల్లవి నటన, వెట్రిమారన్ డైరెక్షన్ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిమే రాబోతుండడం వీళ్లిద్దరి అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే. మరి సాయిపల్లవి కోసం వెట్రిమారన్ ఎలాంటి పాత్ర డిజైన్ చేశాడో.. అందులో ఆమె ఎలాంటి ఇంపాక్ట్ వేస్తుందో చూడాలి.