Begin typing your search above and press return to search.

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

నీరజా కోన డిజైన్ చేసిన ఐవరీ కలర్ పట్టుచీరలో సాయి పల్లవి హుందాగా కనిపించింది. బంగారు జరీ అంచు, మెరూన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకుంది. జుంకాలు, చిన్న బొట్టుతో సింపుల్ మేకప్‌లో మెరిసింది. ప్రస్తుతం ధనుష్ ‘ఓం’ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది.

By:  Madhu Reddy   |   17 Nov 2026 3:51 PM IST
పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!
X

సహజ నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సాయి పల్లవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి.. తన అద్భుతమైన నటనతో, ప్రతిభతో అందరి మనసులను ఫిధా చేసేసింది. ఆ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది.





భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న సాయి పల్లవి ఇటీవల నితేష్ తివారీ దర్శకత్వంలో మనీష్ మల్హోత్ర సుమారుగా 4 వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన రామాయణ చిత్రంలో సీత పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో సీతమ్మను తలపించింది అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.పైగా సౌత్ సెలబ్రిటీలు సాయి పల్లవి సీతా క్యారెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.





అలాంటి సీతమ్మ తాజాగా పట్టు చీరలో కనిపించి మరింత సాంప్రదాయంగా అందరి హృదయాలను దోచుకుంది. ఈ ఫోటోలను నీరజాకోన షేర్ చేయడం గమనార్హం. లిరిసిస్టుగా మంచి పేరు సొంతం చేసుకున్న నీరజాకోన ఇండియన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఈమె తాజాగా డిజైన్ చేసిన పట్టు చీరలో సాయి పల్లవి మరింత హుందాగా, అందంగా కనిపించింది. మరి సాయి పల్లవి కట్టుకున్న ఆ చీర , ధరించిన బ్లౌజ్, ఆమె ఫుల్ మేకోవర్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..





సాయి పల్లవి ధరించిన, నీరజాకోన డిజైన్ చేసిన ఈ స్టైలింగ్ అవుట్ ఫిట్ డీటెయిల్స్ విషయానికి వస్తే.. ఇందులో సాంప్రదాయం ఐవరీ కలర్ పట్టుచీర , ముదురు మెరూన్ రంగు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి ఎంతో హుందాగా కనిపించింది సాయి పల్లవి. మృదువైన ఐవరీ కలర్ పట్టు చీరకు వెడల్పాటి బంగారు జరి అంచు బోర్డర్ తో డిజైన్ చేశారు. చీర పై అక్కడక్కడ ముదురు మెరూన్ గోల్డ్ కలర్ దారాలతో అందమైన బుటీలు చేతితో డిజైన్ చేయడం ఈ చీరకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. బ్లౌజ్ విషయానికి వస్తే ముదురు మెరూన్ రంగు ఫ్యాబ్రిక్ పై బంగారు జర్దోసి పూసలు, సీక్వెన్స్ తో అద్భుతమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేశారు. చేతుల అంచులకు చిన్న చిన్న ముత్యాల లాంటి పూసలు వేలాడేలా డిజైన్ చేశారు. మొత్తానికి అయితే ఈ సాంప్రదాయ అవుట్ ఫిట్ సాయి పల్లవిని మరింత అందంగా మార్చేసింది.

ఈ అవుట్ ఫిట్ లో సాయి పల్లవి ధరించిన ఆభరణాల విషయానికొస్తే.. ప్రముఖ జువెలరీ సంస్థ డిజైన్ చేసిన ఇయర్ కప్ ఝుంకాలు ధరించింది. మెడలో ఎటువంటి ఆభరణాలు ధరించకుండా నుదుటన చిన్నటి బొట్టు, సహజమైన మేకప్ వదులుగా వదిలిన ఉంగరాలు జుట్టుతో చాలా సింపుల్ గా, క్లాసీగా కనిపించింది సాయి పల్లవి.. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం అనే చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమాలో తొలిసారి ఈమె యాక్షన్ పర్ఫామెన్స్ చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు.