Begin typing your search above and press return to search.

సాయిపల్లవి vs శ్రీలీల.. డ్యాన్స్‌లో ఎవరు ఇరగదీసారంటే..!

ధనుష్ నటిస్తున్న ‘OM’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిపల్లవి, శ్రీలీల కలిసి సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ‘అలాకా లూవా’ పాటకు ఇద్దరూ స్టేజ్‌పై డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. సాయిపల్లవి స్టెప్పులు కంపోజ్ చేయగా, శ్రీలీల తన ఎనర్జీ, గ్రేస్‌తో అలరించింది. వీరిద్దరి డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   17 Nov 2026 3:42 PM IST
సాయిపల్లవి vs శ్రీలీల.. డ్యాన్స్‌లో ఎవరు ఇరగదీసారంటే..!
X

టాలీవుడ్‌లో మంచి డ్యాన్సర్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు సాయిపల్లవి,..శ్రీలీల. వీళ్ళిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగే. అలాంటి స్పెషల్ సందర్భమే ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం 'OM' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో సాయిపల్లవి, శ్రీలీల కలిసి స్టేజ్‌పై చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో OM ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం సాయిపల్లవి, శ్రీలీల చేసిన డాన్స్. సినిమాలోని 'అలాకా లూవా' పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు.

సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసే ప్రతి స్టెప్‌ చాలా మోడర్న్ గా ఉంటుంది. క్లిష్టమైన స్టెప్పులను కూడా ఎంతో సులభంగా చెయ్యడం సాయి పల్లవి ప్రత్యేకత. ఈ ఈవెంట్‌లో కూడా తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంది. మరోవైపు శ్రీలీల తనదైన గ్రేస్‌తో స్టేజ్‌పై సందడి చేసింది. సాయి పల్లవి స్టెప్స్ కంపోస్ చేయగా.. వాటికి తనదైన అందంతో శ్రీ లీల అందం తీసుకొచ్చింది.

సాయిపల్లవి తన డ్యాన్స్ నైపుణ్యంతో ఆకట్టుకుంటే, శ్రీలీల తన ఎనర్జీ, గ్రేస్‌తో అభిమానులను అలరించింది. ఇక ఈ కార్యక్రమానికి ధనుష్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా హాజరయ్యారు. OM చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన తదుపరి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.