Begin typing your search above and press return to search.

ప్లీజ్ ..రామాయణాన్ని ..రామాయణంగానే తీయండి..!

నితేశ్ తివారీ తెరకెక్కించిన 'రామాయణం పార్ట్ 1'లో కథకు చేసిన మార్పులపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీత యుద్ధం చేయడం, లక్ష్మణుడి సంభాషణలు, సీతారాముల మధ్య డైలాగ్స్, రావణుడి అపహరణ ఘట్టం చిత్రీకరణపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకి రామాయణానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   10 Nov 2026 11:30 AM IST
ప్లీజ్ ..రామాయణాన్ని ..రామాయణంగానే తీయండి..!
X

రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు. కోట్లాది మంది భారతీయులు ఎంతో భక్తితో, గౌరవంతో చూసే ఇతిహాసం. అందుకే రామాయణాన్ని వెండితెరపై చూపించాలంటే దర్శకులకు పెద్ద బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని.. ఆధారంగా చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు అందులోని ప్రధాన ఘట్టాలు, పాత్రల స్వభావం, సంభాషణల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన నితేశ్ తివారీ దర్శకత్వంలోని రామాయణ పార్ట్ 1 మాత్రం కొన్ని విషయాల్లో ఇది మిస్ చేసింది అనే చెప్పాలి.

సినిమా భారీ స్థాయిలో తెరకెక్కడం, స్టార్ హీరోలు నటించడం, అద్భుతమైన విజువల్స్ ఉండటంతో ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు మాత్రం కథలో చేసిన మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా మొదటి నుంచి ఈ సినిమాలో ఒక సన్నివేశంలో సీతగా నటించిన సాయి పల్లవి యుద్ధం చేసిన సన్నివేశం తెగ వైరల్ అవుతూ.. విమర్శలు తెచ్చుకుంది. వాల్మీకి రామాయణంలో అలాంటి ఘట్టం లేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కథను ఆసక్తికరంగా చూపించడానికి ఇలాంటి మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

అలాగే లక్ష్మణుడికి సీతాదేవి పాదాలు మాత్రమే చూసి మాట్లాడుతారు. కానీ ఈ సినిమాలో లక్ష్మణుడికి ఏదేదో డైలాగులు పెట్టేసారు. సీతారాముల మధ్య డైలాగ్స్ పెట్టిన విధానం కూడా కొందరికి అతిగా అనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాముడి పాత్ర విషయంలోనూ.. వాల్మీకి రామాయణంలోని రాముడు స్వభావానికి తగినట్లు చూపించలేదని కొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సీత దేవి.. రాముడిని రామా అని పిలవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఇక రావణుడు సీతాదేవిని అపహరించే ఘట్టం అయితే సరిగానే చూపివ్వలేదు. సినిమా కోసం కొన్ని మార్పులు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ రామాయణం విషయంలో మాత్రం వాల్మీకి రామాయణానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

రామాయణాన్ని అభిమానించే చాలామంది..సినిమా వాళ్లు రామాయణం తీయకపోయినా పరవాలేదు కానీ.. తీసినప్పుడు రామాయణాన్ని రామాయణంగా తీస్తే చాలు అని కామెంట్లు పెడుతున్నారు.