Begin typing your search above and press return to search.

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

నటి సాయి పల్లవి కోయంబత్తూరులో సుమారు రూ.8 కోట్ల విలువైన ఇంటిని సంప్రదాయ దక్షిణ భారతీయ శైలిలో నిర్మించుకున్నట్లు సమాచారం. ఆధునిక హంగులకు దూరంగా సాధారణ ఫర్నిచర్, కుటుంబ ఫొటోలు, పచ్చని మొక్కలు, ప్రత్యేక పూజా గదితో ఇంటిని ప్రశాంతంగా తీర్చిదిద్దారు. స్టార్‌డమ్ ఉన్నా నిరాడంబర జీవనశైలికి ప్రాధాన్యమివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

By:  Srikanth Kontham   |   15 Nov 2026 12:22 PM IST
లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌
X

నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఎంత సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఏ సినిమా సైన్ చేయాల‌న్నా? అందులో బ‌ల‌మైన పాత్ర అయితేనే క‌మిట్ అవుతుంది. పాత్ర‌లో బ‌లం లేకుండా పారితోషికంతో క‌మిట్ చేయించాలంటే? అమ్మ‌డితో సాధ్యం కాని ప‌ని. అందుకే మిగ‌తా హీరోయిన్ల‌తో సాయి ప‌ల్ల‌విని ఎంత మాత్రం పోలిక చేయ‌డానికి అవ‌కాశం ఉండ‌ద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ఇక వ్య‌క్తిగత జీవితంలో అంతే స్వేచ్ఛ‌నుగానూ జీవించ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది. బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటే తానో సెల‌బ్రిటీని అన్న విష‌యాన్ని మ‌ర్చిపోయి వ్య‌వ‌హారిస్తుంది.

ఎవ‌రికీ తెలియ‌కుండా ముఖానికి స్కార్ప్ క‌ట్టుకుని ఎంచ‌క్కా వీధుల‌న్నీంటిని చుట్టేస్తుంది. న‌చ్చిన సినిమాలు థియేట‌ర్ కు వెళ్లి సామాన్య జ‌నంతో క‌లిసి చూస్తుంటుంది. అలాగే నిజ జీవితంలోనూ అంతే నిరాడంబరంగా జీవిస్తారనే పేరుంది. ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా? గ్లామర్ ఆర్భాటాలకు దూరంగా ఉంటుంది. కోయంబత్తూరులో సాయి ప‌ల్ల‌వికి 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఆ ఇల్లు విలాసాల కంటే సాంప్రదాయం..ప్రశాంతతకు పెద్దపీట వేయడం విశేషం. సాధారణంగా హీరోయిన్ల‌ ఇళ్లు అంటే ఖరీదైన ఇంటీరియర్స్..అత్యాధునిక హంగులతో మెరిసిపోతుంటాయి.

కానీ సాయి పల్లవి నివాసం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. నిర్మాణ శైలిలో సాంప్రదాయ దక్షిణ భారతీయ మూలాలు.. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని పెంచే సాధారణ ఫర్నిచర్‌కు మాత్రమే చోటు కల్పించారు. విలాసవంతమైన డిజైన్ల కంటే ఇంట్లో ఉన్నవారికి కావాల్సిన సౌకర్యం.. ప్రశాంత వాతావరణం ఉండేలా ఇంటిని తీర్చిదిద్దడం కుటుంబ ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ఇంటిలో లివింగ్ రూమ్ విశాలంగా ఉండి కుటుంబ సభ్యులంతా కలిసి సమయం గడిపేలా డిజైన్ చేసారు. సంప్రదాయ చెక్కతో చేసిన ఫర్నిచర్.. కంఫర్టబుల్ కౌచ్‌లు .. ఇంట్లో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఫ్యామిలీ ఫోటోలు గదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆధునిక టెక్నాలజీ ఆర్భాటాలకు దూరంగా కుటుంబ బంధాలకు విలువనిచ్చేలా హాల్‌ను ఎంతో అందంగా అమ‌ర్చుకున్నారు. బెడ్‌రూమ్‌ల విషయానికి వస్తే అక్కడ ఎలాంటి హంగులు లేకుండా అత్యంత సహజమైన కాంతి ప్రసరించేలా డిజైన్ చేశారు. ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే లైట్ కలర్స్..చెక్కతో చేసిన మంచాలు.. సాధారణ అల్మారాలతో గదులు ఆహ్ల‌దంగా కనిపిస్తాయి. అలాగే ఇంటి చుట్టూ పచ్చని చెట్లు..మొక్కలతో కూడిన బాల్కనీలు.. గార్డెన్ నివాసానికి మరింత సహజత్వాన్ని తెచ్చి పెట్టాయి.

ఉరుకుల పరుగుల నగర జీవితానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతతను కోరుకునే వారికి ఇలాంటి ఇల్లు పర్‌ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుంది. ఇంట్లో కుటుంబ సాంప్రదాయాలకు..ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసారు. ఈ క్ర‌మంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా గది అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. అనవసరమైన డెకరేషన్స్‌కు తావు లేకుండా దైవారాధనకు తగిన ప్రశాంత వాతావరణాన్ని గది కలిగి ఉంది. గ్లామర్ ప్రపంచంలో కొన‌సాగుతున్నా? మూలాలను.. సొంత ఊరి సంస్కృతిని ఏమాత్రం మరచిపోకుండా జీవిస్తున్న సాయి పల్లవి తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.