ఆ డైరెక్టర్ కు పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
సాయి పల్లవి. సౌత్ లోని మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. సౌత్ లోని పలు భాషల్లో నటించిన సాయి పల్లవి సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు
By: Sravani Lakshmi Srungarapu | 13 Sept 2025 9:00 AM ISTసాయి పల్లవి. సౌత్ లోని మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. సౌత్ లోని పలు భాషల్లో నటించిన సాయి పల్లవి సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఆమె ఏదైనా సినిమా ఓకే చేయాలంటే అందులో తన పాత్రకు ప్రాధాన్యం బాగా ఎక్కువగా ఉండాలి. పాత్రకు ప్రాధాన్యంతో పాటూ అందులో పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే సాయి పల్లవి ఆ సినిమాను ఓకే చేస్తారు.
లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా నిర్మొహమాటంగా నో చెప్పేస్తారామె. గతంలో మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ లో చిరూకి చెల్లి పాత్ర కోసం ముందు సాయి పల్లవినే అడిగారు. కానీ ఆమెకు క్యారెక్టర్ నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశారామె. సినిమాల ఎంపిక విషయంలో ఆమె అంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలాంటి సాయి పల్లవి నుంచి తండేల్ తర్వాత మరో సినిమా రాలేదు.
ఏ మాత్రం తొందరపడని సాయి పల్లవి
అమరన్, తండేల్ బ్లాక్ బస్టర్లుగా నిలిచినా పల్లవి తన స్పీడును ఏ మాత్రం పెంచలేదు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ మూవీ రామాయణ పైనే ఉంది. ఈ సినిమాతో తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు సాయి పల్లవి. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. కెరీర్ లో మొదటి నుంచి సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్న సాయి పల్లవి, రామాయణ లాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి.
శింబు49లో సాయి పల్లవి?
అయితే వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా రాబోయే శింబు49 లో హీరోయిన్ ఆఫర్ సాయి పల్లవి వద్దకు వెళ్లిందంటున్నారు. గ్లామర్ పరంగా కాకుండా యాక్టింగ్ పరంగా బెస్ట్ వాళ్లను తీసుకోవాలనే ఆలోచనతో, సాయి పల్లవి అయితే ఈ పాత్రకు న్యాయం చేస్తారని మేకర్స్ ఆమెను సంప్రదించారని చెన్నై మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ రామాయణ లాంటి ప్రతిష్టాత్మక సినిమాను చేతిలో ఉంచుకున్న సాయి పల్లవి వెట్రిమారన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది డౌట్ గా ఉంది. ఒకవేళ రామాయణ తర్వాత చేయడానికి పల్లవి ఆ మూవీకి ఓకే చెప్తే మాత్రం హైప్ నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అవడం ఖాయం.
