Begin typing your search above and press return to search.

సైలెంట్ అయిన సాయి పల్లవి.. కారణం?

ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి.. నటనతోనే కాదు అందంతో. అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి హృదయాలను దోచుకుంది.

By:  Madhu Reddy   |   1 Jan 2026 10:00 PM IST
సైలెంట్ అయిన సాయి పల్లవి.. కారణం?
X

ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి.. నటనతోనే కాదు అందంతో. అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి హృదయాలను దోచుకుంది. లేడీ పవర్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. చివరిగా అమరన్, తండేల్ వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె.. అప్పటినుంచి మరో సినిమాలో నటించలేదు. కానీ హిందీ రామాయణం సినిమాలో సీత పాత్రలో అవకాశం అందుకుంది. హై బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా కంటే ముందు ఈమె మేరే రహో అని హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా ఈ ఏడాది జూన్ 2026 కి వాయిదా పడింది.

నిజానికి తండేల్ తర్వాత తెరపై కనిపించకుండా ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరిచిన సాయి పల్లవి ఏడాది ఖచ్చితంగా తెరపై కనిపించి అలరిస్తుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ నిరాశ తప్పలేదు.. డిసెంబర్లో విడుదల కావాల్సిన సినిమా కూడా సడన్గా వాయిదా పడేసరికి సాయి పల్లవి ఎందుకు సైలెంట్ అయింది అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. అయితే ఇలా సడన్గా ఈ సినిమా విడుదల కాకపోవడానికి కారణం పెద్ద సినిమాల సందడే అనే చెప్పాలి. గత ఏడాది డిసెంబర్లో బాలకృష్ణ అఖండ 2, అవతార్ యాష్ అండ్ ఫైర్, తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ, ధురంధర్ వంటి చిత్రాల విడుదలే ఈ సినిమా వాయిదాకి కారణమని తెలుస్తోంది.

వాస్తవానికి రణ్ వీర్ సింగ్ ధురంధర్ సినిమా మేనియా ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పాలి. 20 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా.. ఇప్పుడు 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దూసుకుపోతోంది. ఈ సినిమా దెబ్బకు అటు అవతార్ 3, అనన్య పాండే , కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ చిత్రాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇలాంటి సమయంలో తమ సినిమా విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించిన ఈ చిత్ర నిర్మాత అమీర్ ఖాన్ ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడిన తర్వాత విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మరొకవైపు మేరే రహో సినిమా అంచనాలను అందుకోలేదేమో అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఈ సినిమా గనుక నిరాశపరిస్తే ఈ చిత్ర ఫలితం ప్రభావం రామాయణం పై పడుతుందని.. అటు అభిమానులు కూడా భయపడుతున్నారు. అందుకే ఈమె కెరియర్ ఈ సినిమా ఫలితంపై ఆధారపడింది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై సినీ విశ్లేషకులు విభేదిస్తున్నారు. ఎందుకంటే మేరే రహో చిత్రం కేవలం హిందీ చిత్రంగా మాత్రమే చూస్తారు. కానీ రామాయణం సినిమా పాన్ ఇండియా సినిమాగా చిత్రీకరించబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతీయ చిత్రం రామాయణంపై ప్రభావితం చూపించదు అని చెబుతున్నారు. ఏది ఏమైనా పాన్ ఇండియా సినిమా విడుదలకు ముందే సాయి పల్లవి మంచి విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం అందరి దృష్టి మేరే రహో సినిమా విడుదలపైనే ఉంది. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా? లేక డిజాస్టర్ గా నిలుస్తుందా? అసలు సాయి పల్లవికి హిందీలో మార్కెట్ ఎలా ఉండబోతోంది విషయం తెలియాల్సి ఉంది.